R Madhavan: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో బ్రీత్‌లెస్ సాంగ్.. స్టన్ అయిన నటుడు మాధవన్.. ఇన్‌స్టాలో పోస్ట్
'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే టీవీ షోకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వస్తున్న ఈ షోకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది.
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే టీవీ షోకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వస్తున్న ఈ షోకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. జబర్దస్త్, పటాస్ తర్వాత ఆ రేంజ్ రేటింగ్స్ దక్కించుకుంటుంది. సెప్టెంబర్12న ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ట్విన్స్ సింగర్ స్పెషల్ ఎపిసోడ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో స్వర-జయన్ అనే కవలల్లో… స్వర అనే సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించిన బ్రీత్‌లెస్ సాంగ్‌ను 2 నిమిషాల 24 సెకన్ల పాటు నాన్‌స్టాప్‌గా పాడారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రముఖ నటుడు మాధవన్ స్టన్ అయ్యారు. పాటకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
“అసలు బ్రేక్స్ ఇవ్వకుండా పాడటం ఎలా సాధ్యమైంది. పాడినంతసేపు ఇతను ఊపిరి తీసుకున్నట్లు కూడా అనిపించలేదు. దేవుడు అతడికి గొప్ప టాలెంట్ ఇచ్చాడు” అని మాధవన్ రాసుకొచ్చారు.
View this post on Instagram
ఇదే పాటను ఇండియన్ ఐడల్ -5 ఫినాలే వేదికపై గాయకుడు శ్రీరామ చంద్ర పాడారని.. ఆ తరువాత అదే రీతిలో పాడింది స్వర అంటూ షోలో చెప్పాడు హోస్ట్ సుడిగాలి సుధీర్. మొత్తానికి మ్యాడీ పోస్ట్‌తో ఈ వీడియో మరింత ట్రెండ్ అవుతోంది.
Also Read: Viral Video: చేపను క్రూరంగా వేటాడిన ఎండ్రకాయ.. కొండెలతో కనుగుడ్డు పీకేసి.. షాకింగ్
భార్య బర్త్ డే సందర్భంగా నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్