Viral Video: చేపను క్రూరంగా వేటాడిన ఎండ్రకాయ.. కొండెలతో కనుగుడ్డు పీకేసి.. షాకింగ్

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఖాతాలు లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. ఎన్నో రకాల వీడియోలు ఎన్నో నెట్టింట సందడి చేస్తున్నాయి.

Viral Video: చేపను క్రూరంగా వేటాడిన ఎండ్రకాయ.. కొండెలతో కనుగుడ్డు పీకేసి.. షాకింగ్
Lobster Hunts Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2021 | 5:52 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఖాతాలు లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. ఎన్నో రకాల వీడియోలు ఎన్నో నెట్టింట సందడి చేస్తున్నాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చేపల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. చేపలను.. మనుషులు ఎన్నో రకాల జీవులు ఆహారంగా చేసుకుంటాయి. మాయగా వేసిన ఉచ్చుల్లో ఈజీగా చిక్కుకునేవి.. ట్రాపుల్లో పడిపోయేవి ఎక్కువగా చేపలే అని చెప్పాలి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఎండ్రకాయ చేపను వేటాడింది. అయితే ప్రధానంగా చెప్పాల్సింది… దాని వేట పద్దతి గురింది. క్రూరమైన వేట అంటే మనకు వెంటనే సింహం, పులి, చిరుత వంటి జంతువులు గుర్తుకువస్తాయి. అయితే ఇక్కడ ఎండ్రకాయ వేట కూడా అందుకు ఏ మాత్రం తక్కువకాదు. చేపను తన కబంద కొండెలతో బంధించిన ఎండ్రకాయ.. దాని కన్నుని అత్యంత క్రూరంగా పెకిలించివేసింది. ఆపై కనుగుడ్డుని తన నోటి వద్దకు తీసువెళ్లింది. చాలా తక్కువ సెకన్ల మాత్రమే నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అంత పెద్ద చేపను ఆ ఎండ్రకాయ ఎలాగూ తినలేదు కాబట్టి.. కేవలం దాని కళ్లను ఆహారంగా చేసుకునేందుకు చేపను వేటాడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

షాకింగ్ వీడియో చూడండి 

చూశారుగా ఎండ్రకాయ చేపను ఎలా చిదిమేసిందో. ఈ షాకింగ్ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇలాంటి వీడియో తామెప్పుడు చూడలేదని కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  Viral Video: సీటు దొరకలేదు.. క్రేజీ ఐడియాతో ట్రైన్‌లో ఉన్నవాళ్లకి మెంటలెక్కించాడు

భార్య బర్త్ డే సందర్భంగా నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్