Viral Video: విదేశీ యువకుడితో కలిసి.. బాలీవుడ్ సూపర్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తాత.. వీడియో వైరల్

Viral Video: కొంతమంది వృద్ధులు తమకున్న దానితో సంతోషముగా సరదాగా జీవిస్తూ.. నలుగురికి ఆనందాన్ని పంచుతారు. వయసుతోపనిలేదు.. ఎంజాయ్ చేయడానికి మనసు..

Viral Video: విదేశీ యువకుడితో కలిసి.. బాలీవుడ్ సూపర్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తాత.. వీడియో వైరల్
Old Man Dance Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2021 | 4:11 PM

Viral Video: కొంతమంది వృద్ధులు తమకున్న దానితో సంతోషముగా సరదాగా జీవిస్తూ.. నలుగురికి ఆనందాన్ని పంచుతారు. వయసుతోపనిలేదు.. ఎంజాయ్ చేయడానికి మనసు ఉంటె చాలు అంటూ తమ నేచర్ తో పదిమందికి చిరునవ్వుని పంచుతారు. తాజాగా  విదేశీ యువకుడు డ్యాన్స్ చేస్తుంటే  అతనికి తాత జతకలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది.  వివరాల్లోకి వెళ్తే..

భారతీయ వీధిలో ఒక విదేశీ వ్యక్తి డ్యాన్స్  చేస్తున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు అతనితో జతకట్టి.. తనదైన శైలిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు.  ఒక విదేశీయుడు బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటే.. అతని చుట్టును జనం చేరి ఆసక్తిగా చూస్తున్నారు.   సల్మాన్ ఖాన్-కాజోల్ చిత్రం ప్యార్ కియాతో డర్నా క్యా లోని ఓ ఓ జానే జానా సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నాడు.. అప్పుడు ఓ తాత ఆ విదేశీ యువకుడితో జతకలిశారు. ఆ తాతగారు సాంగ్ ని విదేశీవ్యక్తి డ్యాన్స్ ని ఆస్వాదిస్తూ..  తనదైన శైలిలో  స్టెప్పులు వేశాడు.

ఈ వీడియోను కొద్ది రోజుల క్రితం ‘సుధీర్ దండోటియా ‘ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  ఈ వీడియో కి పలువురు నెటిజన్లు ఫిదా ‘దాదాజీ’ అద్భుతమైన డ్యాన్స్‌ అంటూ కొందరు.. మరికొందరు.. ఇది నా భారత దేశం మా తాతగారు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం వ్యక్తం చేయడానికి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి వయసుతో పనిలేదు తాతగారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు .

Also Read:

 ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. అయితే ఖర్జూరం విత్తనాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!