AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Date Seeds Benefits: ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. అయితే ఖర్జూరం విత్తనాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

Date Seeds Benefits: ఖర్జూర పండ్ల ఎంత ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయో.. అదే విధంగా ఖర్జూరం గింజలు కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ ఖర్జూరం గింజలను..

Date Seeds Benefits: ఖర్జూరం తిని గింజలు పడేస్తున్నారా.. అయితే ఖర్జూరం విత్తనాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
Date Seeds Benefits
Surya Kala
|

Updated on: Nov 25, 2021 | 3:48 PM

Share

Date Seeds Benefits: ఖర్జూర పండ్ల ఎంత ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయో.. అదే విధంగా ఖర్జూరం గింజలు కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ ఖర్జూరం గింజలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.  ఖర్జూరం గింజల్లో కూడా చాలా పోషక విలువలను కలిగి ఉన్నాయి. అయితే ఈ గింజలను నేరుగా తినలేరు కనుక.. ఖర్జూరపు గింజల పొడిని ఉపయోగిస్తారు. ఈరోజు ఖర్జూరం గింజలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల  తెలుసుకుందాం..

ఖర్జూరం గింజల పొడి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జింక్, కాడ్మియం, కాల్షియం , పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది.  అందుకని ఈ గింజలు DNA దెబ్బతినకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి. వీటిల్లో ఉన్న యాంటీవైరల్ ఏజెంట్లు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు, చర్మ ప్రయోజనాలు, జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఆకాలంలో వచ్చే తెల్ల వెంట్రుకలను నిరోధిస్తుంది.

షుగర్ పేషేంట్స్ కు : ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం.  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఈ ఖర్జూరం గింజల పొడి ఇన్సులిన్ ఉత్పత్తి లక్షణాలను కలిగి ఉంది. ఎవరైనా మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉన్నట్లయితే, ఖర్జూరపు గింజల పొడిని ఒక వారం పాటు ప్రయత్నిస్తే.. మంచి ఫలితాలు పొందుతారు.

DNA దెబ్బతినకుండా నిరోధిస్తుంది: ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం యొక్క DNA నిర్మాణాన్ని సంరక్షిస్తాయి. అంతేకాదు  ఖర్జూరాలు అనేక ఖనిజాలను ఉన్నాయి కనుక రోగనిరోధక వ్యవస్థ పెంపొందిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు, కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది కిడ్నీలో రాళ్లు , మూత్రాశయ వ్యాధుల చికిత్సకు ఖర్జూర విత్తనాలు సహాయపడతాయి. ఖర్జూరం అనేక ఔషధ సమ్మేళనాలను కలిగి ఉంది.  కార్టికోస్టెరాయిడ్స్ వలె పనిచేస్తుంది. అందుకనే సాంప్రదాయ వైద్యం చేసేవారు మూత్రపిండాలు,మూత్రాశయ రుగ్మతలు, వాపు , అంటు వ్యాధుల చికిత్స ఖర్జూరం గింజలను ఉపయోగిస్తారు.

యాంటీఆక్సిడెంట్లు: ఖర్జూరం విత్తనాల్లో అధికంగా యాంటీఆక్సిడెంట్లలున్నాయి.దీంతో యాంటీఆక్సిడెంట్ ఆరోగ్య మెరుగుదలకు  వీటిని ఆహార పదార్ధంగా ఉపయోగించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇరానియన్ ఖర్జూర విత్తనాలను ఔషధ,   వ్యాపార అవసరాల కోసం సహజ యాంటీఆక్సిడెంట్లగా పరిగణిస్తారు.

ఖర్జూర విత్తనాలల్లో ఫైబర్ ఖర్జూరపు గింజలు డైటరీ ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. అందువల్ల, ఖర్జూరపు గింజల పొడి జీర్ణశయాంతర రుగ్మతలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్స గా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను చంపుతుంది.

అయితే ఖర్జూర విత్తనాలను తినడానికి కష్టం కనుక.. వీటిని పౌడర్ గా మార్చి తినే ఆహారం లో చేరుకుంటున్నారు.  ఖర్జూర విత్తన పొడిని కాల్చిన లేదా కాల్చిన గింజల నుండి తయారు చేస్తారు.

ఈ పొడిని కొంతమంది తమ కాఫీలో కలుపుకుని తాగితే.. మరికొందరు టీ లా తయారు చేసుకుని తాగుతారు. కొందరు స్మూతీల్లోనూ.. కేక్ పై టాపింగ్ కోసం ఈ ఖర్జూర గింజల పొడిని ఉపయోగిస్తారు.

Also Read:  ఐస్‌లాండ్‌లో ఆవు బొమ్మను పోగొట్టుకున్న చిన్నారి… దానిని తిరిగి చిన్నారి చెంతకు చేర్చిన నెటిజన్లు

.