AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ఆ ప్రాంతంలో కరోనా కల్లోలం.. రానున్నది శీతాకాలం.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే లక్షలాది మంది మృతి అంటూ వార్నింగ్

Corona Virus: యూరోపియన్ దేశాల్లో రోజు రోజుకీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజువారీ కొత్త కేసుల నమోదు, మృతుల సంఖ్య భారీగా ఉండడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ..

Corona Virus: ఆ ప్రాంతంలో కరోనా కల్లోలం.. రానున్నది శీతాకాలం.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే లక్షలాది మంది మృతి అంటూ వార్నింగ్
Europe Corona
Surya Kala
|

Updated on: Nov 25, 2021 | 5:06 PM

Share

Corona Virus: యూరోపియన్ దేశాల్లో రోజు రోజుకీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజువారీ కొత్త కేసుల నమోదు, మృతుల సంఖ్య భారీగా ఉండడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.  చైనా లో పుట్టిన ఈ మహమ్మారి కరోనా రెండేళ్ల కావస్తున్నా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతున్నా యూరోప్ దేశాల్లో మాత్రం రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ.. విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యూరోప్ లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు..  వచ్చే వసంత కాలం నాటికి కరోనా వైరస్ మహమ్మారి ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని WHO యూరప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హాన్స్‌ లుగే హెచ్చరించారు. అక్టోబర్‌ మధ్య కాలం నుంచి ఈ పెరుగుదల కొనసాగుతోందని చెప్పారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని.. యూరోప్ లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. అంతేకాదు ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని .. మాస్కులు అందరూ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఇప్పటికే యూరోపియన్‌ దేశాల్లో అనేక ప్రాంతంలో 1బిలియన్‌ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.

యూరప్,  మధ్య ఆసియా లో COVID-19 కల్లోలం చాలా తీవ్రంగా ఉంది. అంతేకాదు శీతాకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, వ్యక్తులు ఈ  మహమ్మారిని ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుందని  డాక్టర్ క్లూగే అన్నారు.  గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలు కొవిడ్‌ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్‌ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. జర్మనీలో మరణాలు లక్ష మార్కును దాటినట్టు పేర్కొంది. రష్యా లో కూడా కరోనా కల్లోలం కొనసాగుతుందని.. కనుక యూరోప్ ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సిన్ తీసుకోవాలని.. లాక్ డౌన్ పరిస్థితి వచ్చేలా నడుచుకోవద్దంటూ చెప్పారు.

Also Read:  కాకినాడ డీసీసీబీ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

Follow Us
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!