AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: తైమూర్‌కు ఆ మాట చెబితే నాపైనే అరుస్తాడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కరీనా..

కరీనా కపూర్‌ - సైఫ్‌ అలీఖాన్‌లకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీఖాన్ అనే ఇద్దరు ముద్దుల తనయులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో చిన్న పిల్లాడు జహంగీర్‌ సంగతి పక్కన పెడితే పెద్ద కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ ఉంది

Kareena Kapoor: తైమూర్‌కు ఆ మాట చెబితే నాపైనే అరుస్తాడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కరీనా..
Basha Shek
|

Updated on: Nov 25, 2021 | 9:21 PM

Share

కరీనా కపూర్‌ – సైఫ్‌ అలీఖాన్‌లకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీఖాన్ అనే ఇద్దరు ముద్దుల తనయులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో చిన్న పిల్లాడు జహంగీర్‌ సంగతి పక్కన పెడితే పెద్ద కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ ఉంది. సెలబ్రిటీలతో సమానంగా పాపులారిటీ సాధించుకున్నాడీ స్టార్‌ కిడ్‌. తైమూర్‌ ఎక్కడ కనిపించినా అతడి ఫొటోలు, వీడియోల కోసం ఎగబడుతుంటారు. ఈ నేపథ్యంలో తైమూర్‌ గురించి ఆమె తల్లి కరీనా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. జహంగీర్‌ చాలా సైలెంట్‌గా ఉంటాడని, తైమూర్‌ మాత్రం బాగా విసిగిస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరీనాను ‘బయటకు వెళ్లి ఆడుకోమని మీ కుమారులను ప్రోత్సహిస్తారా’? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందీ అందాల తార.

‘నా పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు. జహంగీర్‌ సంగతి పక్కన పెడితే తైమూర్ అయితే ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చోడు. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తిరుగుతూనే ఉంటాడు . మేం ప్రస్తుతం పటౌడీ ప్యాలెస్‌లో ఉంటున్నాం. ఆ ప్యాలెస్‌లో ఎంత ఖాళీ స్థలం ఉంటుందో, ఎన్ని చెట్లు ఉంటాయో అందరికీ తెలిసిందే. నిత్యం ప్యాలెస్‌ చుట్టూ పరిగెడుతుంటాడు. చెట్లను ఎక్కేందకు ప్రయత్నిస్తుంటాడు. నిజం చెప్పాలంటే వాడు నన్ను విసిగిస్తున్నాడు. ఒక్కోసారి కొంచెం కామ్‌గా ఉండమని చెబితే నా మీదే అరుస్తాడు. తనకు సెలవులు ఉన్నాయని.. ఎందుకు ఆడుకోకుండా కామ్‌గా ఉండమని చెబుతావంటూ గట్టిగా అరుస్తాడు’ అని కరీనా పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే.. కరీనా ప్రస్తుతం అమిర్‌ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చద్ధా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read:

Chatrapathi’s Sureedu: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

Bhima Nayak : పవర్ స్టార్ “భీమ్లానాయక్” టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

Katrina Kaif: మెహెందీ ఫంక్షన్‌ కోసం రాజస్థాన్‌ హెన్నాను ఆర్డర్‌ చేసిన కత్రినా.. ఎంత ఖర్చు అవుతుందంటే..

భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి