Katrina Kaif: మెహెందీ ఫంక్షన్‌ కోసం రాజస్థాన్‌ హెన్నాను ఆర్డర్‌ చేసిన కత్రినా.. ఎంత ఖర్చు అవుతుందంటే..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది

Katrina Kaif: మెహెందీ ఫంక్షన్‌ కోసం రాజస్థాన్‌ హెన్నాను ఆర్డర్‌ చేసిన కత్రినా..  ఎంత ఖర్చు అవుతుందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 9:04 PM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఇంట్లో ఇటీవలే కత్రినా- విక్కీల నిశ్చితార్థం జరగడం, వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలిసిందే. అయితే తమ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత పాటిస్తున్న ఈ ప్రేమ పక్షుల పెళ్లి గురించి రోజుకో కొత్త హల్‌చట్‌ చేస్తోంది. తాజాగా వీరు ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే ఇప్పటివరకు తమ పెళ్లిపై కత్రినా- విక్కీలు కానీ వారి కుటుంబాలు స్పందించిన దాఖలాలు లేవు. మరోవైపు వీరి పెళ్లి పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది.

అందుకే అంత ఖర్చు.. కాగా కత్రినా కైఫ్ పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే మెహందీ ఫంక్షన్‌లో పెట్టుకునే హెన్నా కోసం ఆమె భారీగానే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. జోధ్‌పూర్ లోని పాలి జిల్లాలో ప్రత్యేకంగా తయారుచేసే ఈ హెన్నాను సోజత్‌ మెహెందీ అంటారట. దీనికి సంబంధించి మెహందీ నమూనాలు కూడా కత్రినాకు చేరాయని వారి కుటుంబీకులు చెబుతున్నారు. ఇది సహజ సిద్ధంగా తయారవుతుందని, ఎటువంటి రసాయనాలు మిక్స్‌ చేయరని అందుకే దీని తయారీకి రూ. 50వేల నుంచి రూ.1 లక్ష ఖర్చు అవుతుందట. అయితే హెన్నాను తయారుచేసే వ్యక్తి సెలబ్రిటీ కపుల్స్‌ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read:

ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో

సత్యదేవ్ నయా మూవీ “స్కైల్యాబ్” నుంచి లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘రారా లింగా’.. పాట..

Anubhavinchu Raja: ఈ టైంలో సినిమా చేయడం అవసరమా అనిపించింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రియ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే