సత్యదేవ్ నయా మూవీ “స్కైల్యాబ్” నుంచి లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘రారా లింగా’.. పాట..

టాలెంటెడ్ హీరో సత్య దేవ్ నటిస్తున్న తాజా చిత్రం స్కై లాబ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో త్వరలో మరో విభిన్నమైన కథను

సత్యదేవ్ నయా మూవీ స్కైల్యాబ్ నుంచి లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న 'రారా లింగా'.. పాట..


టాలెంటెడ్ హీరో సత్య దేవ్ నటిస్తున్న తాజా చిత్రం స్కైల్యాబ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో త్వరలో మరో విభిన్నమైన కథను మన ముందుకు తీసుకురానున్నారు. స్కైల్యాబ్ అనే ఆసక్తికర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే రాహుల్ రామకృష్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ప్రస్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో స్కైల్యాబ్ నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. “రారా లింగా రారా లింగా .. కథ చెబుతా కచ్చితంగా, రారా లింగా రామాలింగా ఇనుకోరా సుబ్బరంగా”.. అంటూ సాగే ఈ పాటకు సానపాటి భరద్వాజ్ పాత్రో సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను సీన్ రోల్డన్ ఆలపించాడు.  1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది.  ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

Click on your DTH Provider to Add TV9 Telugu