Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు. ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌లోపాల్గొని ప్రేక్షకులతో కలిసి ఉత్సాహంగా కాలు కదిపారు.

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 4:42 PM

బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు. ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌లోపాల్గొని ప్రేక్షకులతో కలిసి ఉత్సాహంగా కాలు కదిపారు. కన్సర్ట్‌కు హాజరైన అభిమానులతో ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా అలియా, రణ్‌వీర్‌ ప్రస్తుతం’ రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. ధర్మేంద్ర, జయాబచ్చన్‌, షబానా అజ్మీ వంటి సీనియర్‌ తారలు ఈ సినిమాలో భాగమవుతున్నారు. కరణ్‌ జోహర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఢిల్లీ పరిసరాల్లో జరుగుతోంది. కాగా షూటింగ్‌ నుంచి కాస్త విరామం లభించడంతో అలియా, రణ్‌వీర్‌ ఢిల్లీ విధుల్లో సరదాగా కలియ తిరిగారు.

ఈ సందర్భంగా గుర్‌గ్రామ్‌లో వేదికగా జరిగిన ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ ఏపీ ధిల్లాన్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొని ఎంజాయ్‌ చేశారీ బాలీవుడ్‌ స్టార్స్‌. ఎలాంటి హడావిడి లేకుండా ప్రేక్షకుల్లో కలిసిపోయి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ధిల్లాన్, గురిందర్ గిల్, షిండా కహ్లోన్‌ కలిసి ఆలపించిన ‘Brown Munde’ పాటకు అలియా-రణ్‌వీర్‌ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా మరో వీడియోలో అభిమానులతో ముచ్చటిస్తూ కనిపించింది అలియా. ‘ నీ ముఖం నాకు గుర్తుంది. 2014లో మొదటిసారి నిన్ను కలుసుకున్నాను..ఐ లవ్‌ యూ..ఐ లవ్‌ యూ’ అని ఒక మహిళా అభిమానితో చెప్పగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. కాగా ఎప్పుడో ఏడేళ్ల క్రితం కలుసుకున్న అభిమానిని గుర్తుపెట్టుకుని మరీ పలకరించిన అలియాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అలియా, రణ్ వీర్ ఇంతకు ముందు  ‘గల్లీబాయ్’ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Also Read:

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

Mahesh Trivikram: పూజా హేగ్డే అలా చేజార్జుకున్న అవకాశం.. సమంతకు ఇలా కలిసొచ్చిందా.?

Shyam Singha Roy : ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్న శ్యామ్ సింగరాయ్.. నాని నయా ప్లాన్ అదిరిందిగా..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..