Shyam Singha Roy : ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్న శ్యామ్ సింగరాయ్.. నాని నయా ప్లాన్ అదిరిందిగా..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండేళ్లుగా నాని సినిమా థియేటర్ వైపు చూడలేదు.

Shyam Singha Roy : ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్న శ్యామ్ సింగరాయ్.. నాని నయా ప్లాన్ అదిరిందిగా..
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2021 | 3:54 PM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండేళ్లుగా నాని సినిమా థియేటర్ వైపు చూడలేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన వి సినిమా ఓటీటీ వేదికగానే విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే రీసెంట్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు నాని. ఈ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకొని రిలీజ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. కానీ ఈ సారి థియేటర్స్ లో వచ్చి సాలిడ్ హిట్ కొడతా అంటున్నాడు నాని. నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను రాహుల్ సంకృత్యాన్  తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ స్టోరీ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడం తోపాటు ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారట. ఈ క్రమంలోనే ఒక సిటీలో 3 వేలమంది అభిమానులతో ‘ఫ్యాన్ మీట్’ ను కూడా ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. వాళ్ళతోకలిసి ముచ్చటించడమే కాకుండా, అందరితో కలిసి అక్కడే భోజనం చేస్తారని అంటున్నారు. మొత్తానికి శ్యామ్ సింగరాయ్ టీమ్ ప్రమోషన్స్ ను భారీగానే ప్లాన్ చేశారుగా..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

Chiranjeevi: ఏపీ సర్కార్ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. కొన్ని సూచనలు

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..