AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం రాజమౌళి సినిమా వైపే చూస్తుంది. బాహుబలి సినిమాతర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న.

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి
Rrr
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2021 | 4:43 PM

Share

RRR: ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం రాజమౌళి సినిమా వైపే చూస్తుంది. బాహుబలి సినిమాతర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యేరు.  ఇద్దరు స్టార్ హీరోలతో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్లు, గ్లిమ్ప్స్, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమానుంచి. జనని అనే పాటను విడుదల చేయనున్నారు. నవంబర్ 26న ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జక్కన మీడియాతో మాట్లాడారు..

రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా మొత్తానికి ఈ పాట ఆత్మ లాంటిది అని అన్నారు. ఈ పాట సినిమాలోని అన్ని సన్నివేశాలకు సంబంధించి ఉంటుంది అన్నారు. కీరవాణి గారు రెండు నెలలు రీరికార్డింగ్ చేసి ఈ పాటకు మ్యూజిక్ అందించారు. అలాగే తెలుగు లిరిక్స్ కూడా ఆయనే రాసారు అని అన్నారు రాజమౌళి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ లాంచ్ ఉంటుందని అలాగే ఆ తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుందని అన్నారు రాజమౌళి. త్వరలోనే ఈ సినిమాలోని నటీనటులు అందరు మీడియాతో మాట్లాడుతాం అన్నారు. హీరోల ఇంట్రడ‌క్ష‌న్ సీన్లు, ప్రీ క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్, యాక్షన సీక్వెన్స్ వంటివి బోలెడు ఉంటాయ‌ని తెలిపారు. వాట‌న్నింటినీ లోతుగా చూస్తే ఎలా ఉంటుందో.. ఎమోషన్ ఎలా ఉంటుందో చెప్పేలా జ‌న‌ని పాట ఉండేలా చూసుకున్నామ‌ని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

Chiranjeevi: ఏపీ సర్కార్ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. కొన్ని సూచనలు

Viral Photo: ఈ పాలబుగ్గల చిన్నారికి అభిమానుల్లో యమా క్రేజ్.. తెలుగునాట సూపర్ హిట్స్ అందుకుంది..

Follow Us
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..