Bhima Nayak : పవర్ స్టార్ “భీమ్లానాయక్” టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు

Bhima Nayak : పవర్ స్టార్ భీమ్లానాయక్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?
Pawan Kalyan

Bhima Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. ఇప్పటికే యంగ్‌ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు లైన్లో పెట్టిన పవన్‌.. వాటన్నింటిని సూపర్‌ ఫాస్ట్‌‌‌‌గా కంప్లీట్‌ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ట్రై చేయడమే కాదు.. హరి హర వీరమల్లు వంటి పీరియాడికల్ కథతో సరికొత్తగా వస్తున్నారు. వకీల్ సాబ్‌ను ఇంకా మరవక ముందే.. భీమ్లా నాయక్‌గా వచ్చేస్తున్నారు పవన్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. భీమ్లా నాయక్ పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.  ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేనెల 14వ తేదీన గానీ .. 15వ తేదీన గాని టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇక పవన్ – రానా పాత్రలకి సంబంధించిన హైలైట్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

 

Click on your DTH Provider to Add TV9 Telugu