Child Care: చలి ప్రభావం నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండేందుకు ఈ పని చేయండి..
Child Care: చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వారికి తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. శీతాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది.
Child Care: చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వారికి తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. శీతాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకని, శీతాకాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి శీతాకాలంలో పిల్లల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అవాల నూనెతో మసాజ్.. ఆవాల నూనెతో అరికాళ్ళపై మసాజ్ చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. మీరు గోరువెచ్చని ఆవాల నూనెతో పిల్లల అరికాళ్ళకు క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే అది వారి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం వేడెక్కుతుంది.
చలి నుంచి సంరక్షణ.. మస్టర్డ్ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల పిల్లలు చాలా రిలాక్స్‌గా ఉంటారు. దీని కారణంగా వారి శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. ఫలితంగా చలి నుండి వారిని సంరక్షించవచ్చు.
ఉదర సమస్యలకు.. అరికాళ్లపై అనేక ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. మన చేతులతో అరికాళ్లను రుద్దడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది జీర్ణవ్యవస్థను సైతం బలపరుస్తుంది. అరికాళ్లకు మసాజ్ చేయడం వలన పిల్లలకు కడుపునొప్పి, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు ఏర్పడవు.
మంచం తడిగా ఉంచొద్దు.. చలికాలంలో పిల్లలు తరచుగా టాయిలెట్ చేస్తుంటారు. అయితే అరికాళ్లకు మసాజ్ చేసి నిద్రపుచ్చితే వారి శరీరంలో వేడి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో.. పిల్లలు టాయిలెట్ చేయకుండా ఉంటారు. అంతేకాదు.. మంచి రిలాక్స్‌డ్‌గా ఉంటారు.
మెదడు చరుకుగా మారుతుంది.. అరికాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల పిల్లల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాదాలలో ఉండే కొన్ని పాయింట్లు మెదడుకు సంబంధించినవి కూడా. మసాజ్ సమయంలో ఈ పాయింట్లను నొక్కితే వారి మనస్సు ఉత్తేజితమవుతుంది. ఇది పిల్లల ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
ఇలా మసాజ్ చేయండి ముందుగా పిల్లల పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నూనెను కొద్దిగా వేడి చేయండి. కొన్ని చుక్కల నూనె తీసుకుని పిల్లల అరికాళ్లపై, గోళ్లపై రాయండి. దీని తరువాత, మీ రెండు చేతులను రుద్దండి. ఆ తరువాత, నెమ్మదిగా పిల్లల అరికాళ్ళను మసాజ్ చేయండి. సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..