Nawabi Paneer Curry: టమాటా లేకుండా రుచికరమైన వంట.. హైదరాబాదీ నవాబీ పనీర్ గ్రేవీ కర్రీ తయారీ..

Nawabi Paneer Curry: టమాటా ధర రోజు రోజుకీ పెరిగిపోతూ.. డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో టమాటాలు అవసరం లేని కూరలు తయారు చేయడానికి..

Nawabi Paneer Curry: టమాటా లేకుండా రుచికరమైన వంట.. హైదరాబాదీ నవాబీ పనీర్ గ్రేవీ కర్రీ తయారీ..
Nawabi Paneer Curry
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2021 | 2:12 PM

Nawabi Paneer Curry: టమాటా ధర రోజు రోజుకీ పెరిగిపోతూ.. డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో టమాటాలు అవసరం లేని కూరలు తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈరోజు టమాటా అవసరంలేని హైదరాబాఢీ మొఘల్ వంటకం నవాబీ పన్నీరు గ్రేవీ కూర తయారీ తెలుసుకుందాం.. సర్వ సాధారణ పనీర్ వంటకాల తయారీలో టమోటాలు అవసరం. అయితే నవాబీ పనీర్ తయారీ ఇందుకు భిన్నం. నవాబీ పనీర్ కూర తయారీకి పెరుగు, పాలు, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాల మసాలా ఉంటే చాలు. విలక్షణమైన నవాబీ శైలిలో రుచికరమైన నవాబీ పనీర్ గ్రేవీ కూర తయారవుతుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఖచ్చితంగా మీ రెగ్యులర్ పనీర్ వంటకాలకు భిన్నంగా ఉంటుంది. అంతేకాదు అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు.

నవాబీ పనీర్ తయారీకి కావలసిన పదార్ధాలు: పనీర్-250 గ్రా వెన్న-1 టేబుల్ స్పూన్ నూనె-2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి-2 ప్రెష్ క్రీం -2 టేబుల్ స్పూన్లు జీరా-2 టేబుల్ స్పూన్లు కసూరి మేతి-1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క-1/2 అంగుళాల చిక్కటి పెరుగు-1/2 కప్పు పాలు-1 కప్పు మసాలా కోసం తరిగిన ఉల్లిపాయ-1 మీడియం అల్లం-1 టేబుల్ స్పూన్ ఎరుపు మిర్చి పొడి-1 టేబుల్ స్పూన్ మిరియాలు-1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి-5-6 నీరు- కప్పు1/2 జీడిపప్పు-3/4 కప్పు

గసగసాలు ఉప్పు-రుచికి సరిపడా..

తయారీ విధానం: మిక్సీలో తరిగిన ఉల్లి పాయ, అల్లం ముక్క, వెల్లుల్లి , పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అనంతరం బాదాం, జీడీ పప్పు, గసగసాలు వేసుకుని నానబెట్టి.. వీటిని మెత్తటి పేస్టుగా రుబ్బుకోవాలి. అనంతరం పన్నీరు ని కావాల్సిన షేప్ లో కట్ చేసుకుని .. నూనె లో గోల్డెన్ బ్రయోన్ వచ్చే వరకూ వేయించుకోవాలి. అనంతరం స్టౌ మీద పాన్ పెట్టు.. నూనె వేసుకుని దానిలో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర,అనాస పువ్వు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్, ఉప్పు వేసుకుని పచ్చి వాసన పోయి.. కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. అనంతరం దానిలో బాదాం జీడిపప్పు పేస్ట్ వేసుకుని వేయించుకుని .. తర్వాత చిక్కటి పెరుగు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మరించి చల్లార్చిన పాలను వేసుకోవాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలను వేసుకుని స్విమ్ లో పెట్టుకుని కొంచెం సేపు ఉడికించి.. తర్వాత కొంచెం ప్రెష్ క్రీమ్ వేసుకుని కొంచెం కసూరి మేతి , కొత్తిమీర వేసుకుని ఉప్పు చూసుకుని స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి. అంతే రుచి కరమైన నవాబీ పనీర్ రెడీ.. ఇది నాన్ తో కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుటుంది.

Also Read:

వచ్చే ఏడాది సెలవులు, పండుగలు ఇవే.. జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం