బరువు తగ్గడానికి రన్నింగ్‌, జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్నారా..! ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..

Weight loss: బరువు తగ్గడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. జిమ్‌లో వర్కట్లు చేయడం నుంచి రన్నింగ్, యోగా వరకు అన్ని చేస్తాం. అయినా ఎటువంటి మార్పు కనిపించదు.

బరువు తగ్గడానికి రన్నింగ్‌, జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్నారా..! ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..
Gym

Weight loss: బరువు తగ్గడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. జిమ్‌లో వర్కట్లు చేయడం నుంచి రన్నింగ్, యోగా వరకు అన్ని చేస్తాం. అయినా ఎటువంటి మార్పు కనిపించదు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది నిద్ర. సరిగ్గా నిద్రపోనివారు ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గరు. ఇది శాస్త్రీయంగా నిరూపణ అయింది. నిద్ర, బరువు తగ్గడంపై మూడు సంవత్సరాల క్రితం స్పెయిన్‌లో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోయే వ్యక్తులు ఎక్కువ జీవక్రియను కలిగి ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. తగినంత నిద్ర పోయిన వ్యక్తులు బరువు తగ్గినట్లు తేల్చారు.

వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు సరిగ్గా నిద్రిస్తేనే బరువు తగ్గుతారు. వ్యాయామంతో పాటు సరైన నిద్ర కచ్చితంగా అవసరం. నిద్రపోయేటప్పుడు పాతకణాలు క్షీణించడం నుంచి కొవ్వు కరగడం వరకు మొత్తం పని జరుగుతుంది. వాస్తవానికి నిద్రిస్తున్నప్పుడు శరీరం ఎటువంటి పని చేయదని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు. నిద్రపోతున్నప్పుడు శరీరం నిరంతరం పని చేస్తుంది. అందుకే రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవడం మంచిది.

డాక్టర్ బెర్గ్ అనే వ్యక్తి బరువు తగ్గాలని ప్రయత్నించే ఒక మహిళ స్టోరీని వివరించాడు. ‘రోజుకు రెండు మూడు గంటలు జిమ్‌లో వర్కవుట్ చేసిన ఒక మహిళ ఆరు నెలలు ప్రయత్నించినా 100 గ్రాములు కూడా తగ్గలేదు. దీంతో చాలా నిరాశచెందింది. దీనికి కారణం ఆ మహిళ రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రించడం. అంతేకాదు ఎక్కువ తినకుండా, ఎక్కువ సేపు వ్యాయామం చేయడం వల్ల ఆమెకు నిద్ర సరిగా పట్టకపోయేది. తర్వాత వ్యాయామ సమయాన్ని గంటన్నరకు తగ్గించి, నిద్రపోయే సమయాన్ని 8 గంటలకు పెంచాను ఆ తర్వాత ఆమె మూడు నెలల్లో 10 కిలోల బరువు తగ్గిందని’ చెప్పాడు. ఇది శాస్త్రీయంగా నిరూపణ జరిగింది.

భూమిపై ఈ ద్వీపం ఒక అద్భుతం.. ఇక్కడి పర్వతాలను ప్రజలు తింటారు కూడా..?

భారత రాజ్యాంగం గురించి వాస్తవాలు.. 15 ప్రత్యేక విషయాలు తెలుసుకోండి..

Hyderabad‌: ఓటర్లకు గమనిక.. ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్

Click on your DTH Provider to Add TV9 Telugu