భూమిపై ఈ ద్వీపం ఒక అద్భుతం.. ఇక్కడి పర్వతాలను ప్రజలు తింటారు కూడా..?

Hormuz Island:ఈ భూమిపై ఇప్పటికీ ఎవ్వరికి తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలిసినప్పుడు వింతగా అనిపిస్తుంది. పర్వతాల గురించి మీకు తెలిసే ఉండాలి.

భూమిపై ఈ ద్వీపం ఒక అద్భుతం.. ఇక్కడి పర్వతాలను ప్రజలు తింటారు కూడా..?
Hormuz Island

Hormuz Island:ఈ భూమిపై ఇప్పటికీ ఎవ్వరికి తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలిసినప్పుడు వింతగా అనిపిస్తుంది. పర్వతాల గురించి మీకు తెలిసే ఉండాలి. అవి చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కోసారి వాటిని విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం కొన్నిసార్లు కుదరదు కూడా. కానీ ఈ పర్వతం గురించి తెలిస్తే మీరు షాకవుతారు. ఇక్కడి ప్రజలు ఈ పర్వతాన్ని చూస్తారు అలాగే తింటారు కూడా. నమ్మలేకున్నా ఉన్నా ఇది నిజం. ఈ ప్రదేశం ఒక ద్వీపం. ఇది జంబూద్వీప్ (ఆసియా) నైరుతి విభాగంలో ఇరాన్ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో పెర్షియన్ గల్ఫ్ నీలి జలాల మధ్యలో ఉంది. ఈ ద్వీపం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.

ఈ ద్వీపం పేరు హార్ముజ్ ద్వీపం దీనిని రెయిన్‌బో ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ దీవి అందం గురించి ప్రపంచానికి ఇంకా తెలియదు. ఈ ద్వీపాన్ని ‘డిస్నీల్యాండ్ ఆఫ్ జియాలజిస్ట్స్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి బంగారు కాలువలు, రంగురంగుల పర్వతాలు, అందమైన ఉప్పు గనులు మనస్సును ఆకర్షిస్తాయి. కేవలం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం ఆకాశం నుంచి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇక్కడ అగ్నిపర్వత శిలలు, రాయి, మట్టి, ఇనుము ఎరుపు, పసుపు, రంగులలో మెరుస్తున్నప్పుడు అది భూమి కాదు మరొక ప్రపంచాన్ని చూసినట్లు అనిపిస్తుంది. ఇక్కడి రాళ్లకి సూర్యుడి కిరణాలను తాకినప్పుడు అవి తళుక్కున మెరుస్తాయి. ఈ ద్వీపంలో 70 కంటే ఎక్కువ రకాల ఖనిజాలు ఉన్నాయి.

ఈ ద్వీపం వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు, ఉప్పు దిబ్బలు ఈ ద్వీపాన్ని అందంగా మారుస్తాయి. ఈ ద్వీపం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న పర్వతం ప్రపంచంలోని ఏకైక పర్వతం దీనిని తినవచ్చు. ఎందుకంటే ఈ పర్వతాలు మందపాటి ఉప్పు పొరలతో ఏర్పడి ఉంటాయి. వివిధ రకాల ఖనిజాల కారణంగా ఈ ద్వీపం నేల కూడా కారంగా ఉంటుంది. దీనిని ఆహారంలో మసాలాగా ఉపయోగిస్తారు. ఇక్కడి ప్రజలు ఎర్రమట్టిని చట్నీగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా స్థానిక కళాకారులు ఇక్కడ ఉన్న ఎర్రమట్టిని పెయింటింగ్‌లో ఉపయోగిస్తారు. ప్రజలు తమ బట్టలకు రంగు వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

Ranveer Singh 83: కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ నుంచి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చేసింది.. ’83’ టీజర్‌ను చూశారా.?

AP Assembly: ఏపీ స్పీకర్‌ కీలక ప్రకటన.. ఇకపై అసెంబ్లీలోకి సెల్‌ఫోన్లకు నో ఎంట్రీ..

Watch Video: ఇలా ఎలా జరిగిందబ్బా.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్‌..! వైరలవుతోన్న వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu