CNG Prices Hiked: వాహనదారులకు మరోషాక్.. పెరిగిన సీఎన్‌జీ ధర..!(వీడియో)
దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇది సామాన్యుడికి మోయలేని భారంగా మారుతోంది. ఇక ఇదే సమంలో సామాన్యులపై మరో భారం వచ్చి పడింది. పెట్రోల్ ధరతో పోలిస్తే ఎంతో కొంత చౌకగా లభించే సీఎన్‌జీ ధరలు కూడా పెరిగిపోయాయి.
దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇది సామాన్యుడికి మోయలేని భారంగా మారుతోంది. ఇక ఇదే సమంలో సామాన్యులపై మరో భారం వచ్చి పడింది. పెట్రోల్ ధరతో పోలిస్తే ఎంతో కొంత చౌకగా లభించే సీఎన్‌జీ ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కిలో సీఎన్‌జీకి 2 రూపాయల 28 పైసలు పెరిగితే, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో 2 రూపాయల 56 పైసలు పెరిగింది. గత 45 రోజుల్లో సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజాగా మళ్లీ పెరగడంతో వాహనదారులకు భారంగా మారింది. ఈ ధరలు పెంపు విషయాన్ని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కిలో గ్యాస్ ధర 52 రూపాయల 04 పైసలకు చేరగా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో అది 58 రూపాయల 58 పైసలకు చేరింది. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెరిగిన సీఎన్‌జీ ధరలు మరింత భారంగా మారాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

