Viral Video: ఈ శునకం చాలా ఇంటెలిజెంట్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన పెట్‌డాగ్ వీడియో..
శునకాలను నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే చాలామంది తమ పెంపుడు కుక్కలను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు. ఇంట్లో అవి కనిపించకపోయినా, దెబ్బలు తగిలినా తల్లడిల్లిపోతుంటారు

శునకాలను నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే చాలామంది తమ పెంపుడు కుక్కలను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు. ఇంట్లో అవి కనిపించకపోయినా, దెబ్బలు తగిలినా తల్లడిల్లిపోతుంటారు. అన్నట్లు ఈ శునకాలకు తెలివితేటలు కూడా ఎక్కువే.. మనుషులు చేసే చాలా పనులు ఇవి కూడా చేయగలుగుతాయి. అప్పుడప్పుడు శునకాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అసలేమైందంటే… ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం తమ పిల్లాడికి మాటలు నేర్పించాలనుకుంటుంది. ‘మామా(అమ్మా)’ అని అనమని పిల్లాడిని కోరుతారు . అలా పలకగలిగితేనే ఫుడ్ అందించేలా షరతు కూడా విధిస్తారు. అయితే ఆ చిన్నారి ‘మామా’ అనకుండా అలాగే ఉండిపోతాడు. ఇంతలో పక్కనే ఉన్న పెట్‌డాగ్ ‘మామా మామా’ అంటుంది. ఇలా పిల్లాడి కంటే ముందే పెట్‌డాగ్ మాటలు నేర్చుకోవడం చూసి అందరూ పగలబడి నవ్వుతారు.
‘మమ్మీ, డాడీ… తమ చిన్నారిని ‘మామా’ అనమని కోరారు. కానీ బేబీకి బదులుగా కుక్క ‘మామా’ అనడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. పగలబడి నవ్వారు. ఇది చాలా తెలివైన శునకం’ అని పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుత నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2.88లక్షల మంది ఈ వీడియోను చూశారు. వేలాదిమంది లైకుల వర్షం కురిపించారు. ‘ఇది చాలా ఇంటెలిజెంట్ డాగ్’, ‘ఈ కుక్క భలే మాట్లాడుతోందే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి అందరినీ ఆకట్టుకుంటోన్నీ ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Mom & dad are trying to get their baby to say “mama” & “more”. Instead, they burst out laughing when their dog says it first. That’s one smart puppy!??⭐?⭐??
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 24, 2021
Also Read:
Viral Video: ఈ వీడియో మీ మనసులను తాకుతుంది.. చిట్టి తల్లి మనసు ఎంత పెద్దదో
Know This: నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో