AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టిన ఎలుగుబంటి.. ‘రేపు రా’ అని చెప్పగానే వెళ్లిపోయింది

అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అర్ధరాత్రి అనుకోకుండా మనింటికి ఏ వన్య మృగమో వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది.

Viral Video: అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టిన ఎలుగుబంటి.. 'రేపు రా' అని చెప్పగానే వెళ్లిపోయింది
Bear Viral Video
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 27, 2021 | 5:58 PM

Share

అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అర్ధరాత్రి అనుకోకుండా మనింటికి ఏ వన్య మృగమో వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది. భయంతో హడలి కేకలు పెడతాం కదా.. కానీ ఇక్కడ ఓ మహిళ అలా చేయలేదు. అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఎలుగుబంటితో ఇప్పుడు కాదు.. రేపు మార్నింగ్‌ రా.. అన్నట్టుగా చెప్పి పంపించేసింది. మీ అనుమానం నాకు అర్ధమైంది.. అది పెంపుడు ఎలుగుబంటి అయ్యుంటుంది అనుకుంటున్నారు కదా… కానే కాదు… అసలు విషయం తెలుసుకుందాం రండి.

అమెరికా న్యూజెర్సీలోని… వెర్నాన్‌కు చెందిన మహిళకు యానిమల్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకు అనుగుణంగా.. ఆమె ఇల్లు అడవి పక్కగానే తీసుకుంది. దాంతో ఆ ఇంటికీ, ఆ చుట్టుపక్కలకూ రెగ్యులర్‌గా యానిమల్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి. అలా వచ్చే వాటికి ఆమె ఏదో ఒక ఆహారం అందిస్తూ ఉంటుంది. ఆమె పెట్టినవి ఎంచక్క తినేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇలా అవి ఆమెకు బాగా దగ్గరయ్యాయి. అవి ఆమెకు ఎంత అలవాటు అయ్యాయంటే… ఆమె నిల్చోమంటే నిల్చుంటున్నాయ్… తాజాగా రాత్రివేళ ఆమె ఇంటికి ఓ పెద్ద ఎలుగుబంటి వచ్చి.. డోర్ కొట్టింది. ఆమె తలుపు తీసింది. ఎలుగుబంటిని వీడియో రికార్డ్ చేస్తూ… “చల్లగాలి లోపలికి వచ్చేస్తోంది… డోర్ మూసివెయ్యి” అని చెప్పింది. ఎలుగుబంటి… ఆమె వైపు కాసేపు అలా చూసి ఇక తనకు ఆహారం పెట్టదనుకుని… డోర్ క్లోజ్ వేసింది. కంప్లీట్‌గా  వెయ్యకుండా… చివర్లో చిన్న గ్యాప్ ఉంచింది. దాంతో ఆ మహిళ… “మిస్టర్ బియర్.. దయచేసి డోర్ క్లోజ్ చేస్తావా” అని గట్టిగా చెప్పడంతో ఎలుగుబంటి పూర్తిగా డోర్ వేసేసింది. అలా ఎలుగుబంటి ఇంటి బయటే ఉండిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Also Read: అధిక వడ్డీ ఆశ.. కి’లేడీ’ ట్రాప్‌లో సినిమా స్టార్స్

Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు.