Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh 83: కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ నుంచి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చేసింది.. ’83’ టీజర్‌ను చూశారా.?

Ranveer Singh 83: భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు దర్శక, నిర్మాతలు బయోపిక్‌లను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు...

Ranveer Singh 83: కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ నుంచి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చేసింది.. '83' టీజర్‌ను చూశారా.?
86 Teaser
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2021 | 2:42 PM

Ranveer Singh 83: భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్‌ నుంచి మొదలు టాలీవుడ్‌ వరకు దర్శక, నిర్మాతలు బయోపిక్‌లను తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రాజకీయా నాయకుల నుంచి మొదలు క్రీడాకారుల వరకు ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా ’83’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఇది కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ అని చెప్పేకంటే టీమిండియా 1983లో వరల్డ్‌ కప్‌ ఎలా సాధించిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్ నటిస్తుండగా మిగతా పాత్రల్లో దీపికా పదుకోన్, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 24 దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎన్నో రోజుల నుంచి క్రికెట్ అభిమానులు ఈ సినిమా అప్‌డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ చిత్ర యూనిట్‌ ’83’ టీజర్‌ను విడుదల చేసింది.

ఈ టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. జూన్‌ 25, 1983 లండన్‌లోని లార్డ్స్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను టీజర్‌లో చూపించారు. లార్డ్‌ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సన్నివేశాలను టీజర్‌లో ప్రస్తావించారు. రణ్‌వీర్‌ సింగ్ ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: BMW Electric Vehicles: వచ్చే ఆరు నెలల్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కార్లు..!

Virat Kohli: ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేం.. 26/11 ఉగ్ర దాడిపై విరాట్ కోహ్లీ ట్వీట్..

kuntala waterfalls: పర్యాటకుల మనస్సు దోచుకుంటున్న కుంతాల జలపాతం.. ఎక్కడుందో తెలుసా..