- Telugu News Photo Gallery Business photos BMW to launch three new electric vehicles over next six months
BMW Electric Vehicles: వచ్చే ఆరు నెలల్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్లు..!
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్లు : ప్రస్తుతం ఇంధర ధరలు పెరుగుతుండటంతో ఆయా కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. ఇక జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ వచ్చే ఆరు నెలల్లో ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ కార్లను..
Updated on: Nov 23, 2023 | 1:09 PM

BMW Electric Vehicles: ప్రస్తుతం ఇంధర ధరలు పెరుగుతుండటంతో ఆయా కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. ఇక జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ వచ్చే ఆరు నెలల్లో ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు తెలిపింది.

ఇందులో తొలి ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఆరు నెలల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మూడు నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ , తొలి సెడాన్ ఎలక్ట్రిక్ కారును ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐఎక్స్‌ను రెండు మోటార్లతో తీసుకురానున్నట్లు బీఎండబ్ల్యూ తెలిపింది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడించింది.

ఈ కారుతోపాటు హోం చార్జింగ్ కిట్‌ను అందించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్ కేంద్రాల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఇంధన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది.




