2024 Oneplus: స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమాను తీశారు.. డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే..
2024 Oneplus: ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం దూరంగా ఉన్న వారితో సంభాషించడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేయలేని పనంటూ ఏది లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా..
2024 Oneplus: ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కేవలం దూరంగా ఉన్న వారితో సంభాషించడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేయలేని పనంటూ ఏది లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు కూడా పెరుగుతున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండడంతో అధునాతన ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌లు ఎన్నో గ్యాడ్జెట్ల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయి. అందులో కెమెరా ఒకటి. స్మార్ట్ ఫోన్‌లో హై క్వాలిటీ కెమెరాలు ఉండడంతో కెమెరా స్థానాన్ని స్మార్ట్ ఫోన్ భర్తీ చేసేసింది. ఇదిలా ఉంటే తాజాగా స్మార్ట్ ఫోన్‌తో ఏకంగా సినిమాను చిత్రీకరించి ఆశ్చర్యపరిచారు కొందరు ఔత్సాహిక ఫిలిమ్ మేకర్స్.
వన్‌ప్లస్ 9 ప్రొతో చిత్రీకరించిన ఈ సినిమాను డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా విడుదల చేశారు. 2024 అనే పేరుతో రూపొందించిన ఈ ఫీచర్ సినిమా 60 నిమిషాలపాటు సాగే యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని వన్‌ప్లస్, విక్రమాదిత్య మోట్‌వానే సంయుక్తంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను చూస్తే అసలు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించారు అంటే నమ్మడం అసాధ్యం. హెచ్‌డీ కెమెరాల్లో చిత్రీకరించిన సినిమాలకు ఏమాత్రం తీసుపోదీ ఫీచర్ ఫిలిమ్. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. C-24 అనే ఒక వైరస్ దేశంలో ఒక్కసారిగా విజృంభిస్తుంది. ప్రజలకు ఒక్కొక్కరిగా ఈ వైరస్ బారిన పడుతుంటారు.
చేతి వేళ్లు నీలి రంగు మారడం లక్షణంగా ఉండే ఈ వైరస్ సోకిన ప్రజలంతా.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తుంది. ఇంతకీ ఈ వైరస్ ఎలా పుట్టింది.? దీనిని ఎలా అధిగమించారు.? ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా.? అన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ వార్త చదివితో ఇకపై.. భవిష్యత్తులో సినిమాలు ఇలాగే ఫోన్లలోనే చిత్రీకరిస్తేరేమోననే సందేహాలు వస్తున్నాయి కదూ.!
Also Read: Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)