Watch Video: ఇలా ఎలా జరిగిందబ్బా.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్‌..! వైరలవుతోన్న వీడియో

European Cricket: యూరోపియన్ క్రికెట్‌లో అద్భుతం జరిగింది. ఓ బ్యాట్స్‌మెన్ విచిత్రంగా పెవిలియన్ చేరడంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

Watch Video: ఇలా ఎలా జరిగిందబ్బా.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్‌..! వైరలవుతోన్న వీడియో
European Cricket Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2021 | 2:04 PM

Viral Video: క్రికెట్‌లో మనం ఎన్నో వీడియోలు చూసుంటాం. రన్‌ ఔట్‌లు, క్యాచులు ఇలా ఎన్నో వీడియోలు నెట్టింట్లో కూడా తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చూసే వీడియో మాత్రం ఇదే తొలిసారిది. ఓ బ్యాట్స్‌మెన్ విచిత్రంగా పెవిలియన్ చేరడం మాత్రం క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్‌ టైం కావొచ్చు. సైప్రస్‌లోని లిమాసోల్‌లోని య్ప్సోనాస్ క్రికెట్ గ్రౌండ్‌లో సైప్రస్ మౌఫ్లన్స్ వర్సెస్ హైద్రీ లయన్స్ మధ్య జరిగిన యూరోపియన్ క్రికెట్ లీగ్ ఫ్యాన్‌కోడ్ ఈసీఎస్ సైప్రస్ క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా ఓ బ్యాట్స్‌మెన్ ప్రత్యేకమైన రీతిలో పెవిలియన్ చేరాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

బ్యాట్స్‌మెన్ ల్యాప్ షాట్‌ను కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి కీపర్ హెల్మెట్‌‌కు తాకి గాల్లోకి లేచింది. ఈ బంతినికి ఫ్లై స్లిప్‌లో ఉంచిన ఫీల్డర్‌ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో షాకవుతూ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరాడు. ఫీల్డర్లు కూడా ఒకింత ఆశ్చర్యం పోవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను యూరోపిన్ క్రికెట్ తన ట్విట్టర్‌లో పంచుకుంది. “మీరు ఇంతకు ముందు ఇలాంటి ఔట్‌ను చూసి ఉండరు” అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియోను పంచుకుంది.

మరోవైపు ఈసీఎస్ ఈ ఏడాది 1,000 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. ఇది యూరోపియన్ క్రికెట్ నెట్‌వర్క్ సాధించిన గొప్ప విజయంగా నిలిచింది. ఇది ఐరోపాలోని నాన్-మేజర్ క్రికెట్ దేశాలలో క్రికెట్‌ను ఒక క్రీడగా ప్రోత్సహించడం, మరింత మంది ప్రతిభావంతులను తయారు చేయడం, పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రారంభించారు.

ఓ బ్యాట్స్‌మెన్ ఇలా పెవిలియన్ చేరడంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read: Watch Video: కోహ్లికి డ్యాన్స్ నేర్పిన చాహల్ భార్య.. హుక్ స్టెప్ వెనకున్న అసలు రహస్యం ఇదే.. వైరలవుతోన్న వీడియో

IND vs NZ 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 345 పరుగులకు ఆలౌట్.. సెంచరీతో శ్రేయాస్, అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న గిల్, జడేజా

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?