వీడు మామూలోడు కాదు.. 11 బంతుల్లో సినిమా చూపించాడు.. ఏ బౌలర్‌ను విడిచిపెట్టలేదు.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్!
అబుదాబి టీ10 లీగ్‌లోని 16వ మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ నార్తర్న్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్ ప్లేయర్...
అబుదాబి టీ10 లీగ్‌లోని 16వ మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ నార్తర్న్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ రహ్మానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 70 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన శైలి పవర్ హిట్టింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టలేదు.. అందరినీ ఊచకోత కోశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఈ ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. అంటే బౌండరీల రూపంలో రెహ్మానుల్లా 11 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రెహ్మానుల్లా రాణించడంతో ఢిల్లీ బుల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నార్తర్న్ వారియర్స్ విధించిన 129 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. రెహ్మానుల్లా(70)కు మరో ఓపెనర్ ల్యూక్ రైట్(40) సాయం చేయడంతో ఢిల్లీ బుల్స్ టార్గెట్‌ను 59 బంతుల్లో చేధించింది.
అటు మరో మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జాజై(59) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా టైగర్స్ తరపున బరిలోకి దిగిన జాజై 26 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 116 పరుగులు చేసింది. ఇక 117 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో జాజై(59) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 8.1 ఓవర్లలో లక్ష్యాన్ని సునాయాసంగా చేధించాడు.
కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!
ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?