వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!
New Variant Viruses: మనుషులపై దాడి చేస్తున్న వైరస్‌లు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు. లక్షల ఏళ్ల నుంచి జంతువులు, పక్షుల్లో ఉన్నవే. కానీ అవి మనుషులపై దాడి చేయలేవు...
New Variant Viruses: మనుషులపై దాడి చేస్తున్న వైరస్‌లు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు. లక్షల ఏళ్ల నుంచి జంతువులు, పక్షుల్లో ఉన్నవే. కానీ అవి మనుషులపై దాడి చేయలేవు. జంతువుల్లోనే ఉండిపోయాయి. కానీ అవి ఇప్పుడు మనపై ప్రభావం చూపిస్తున్నాయి. అవి ఇప్పుడే ఎందుకు దాడి చేస్తున్నాయంటే.. దానికి కారణం ప్రకృతి సమతుల్యం దెబ్బతినడమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆధునీకరణ పేరిట అడవులను నరికివేయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వన్యప్రాణులకు ఆవాసం లేక జనాలకు దగ్గర కావడం ద్వారా ఆ వైరస్‌లు మనుషుల్లోకి వ్యాపించి రూపాంతరం చెందుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వన్యప్రాణుల మాంసం తినడం వల్ల కూడా వాటిలోని వైరస్‌లు మ్యుటేషన్ చెంది మనుషుల్లోకి వ్యాప్తి చెందుతున్నాయని.. తద్వారా అవి మనిషి శరీరంపై దాడి చేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు.
ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్
ఇక ప్రపంచాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా భయపెట్టింది కరోనా మహమ్మారి. ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు ఏడాదికిపైపై చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి కావడం లేదు. కంటినిండా నిద్రలేకుండా చేసింది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాయలో బయటపడ్డ ఒమిక్రోన్ వేరియంట్ ప్రజలకు మరింతగా భయడపెడుతోంది. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిదీ కాదు.. ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. తరచూ ఏదో ఓ కొత్త వైరస్‌లు దాడి చేస్తూనే ఉన్నాయని చెబుతున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? కారణాలు ఏమిటి? భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న సందేహాలు మానవున్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపై ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ (ఐపీబీఈఎస్) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. మనుషులకు కొత్తగా సంక్రమిస్తున్న వైరస్‌లు, రోగాలు అన్ని జంతువులు లేదా పక్షుల నుంచి వ్యాపిస్తున్నవేనని తెలిపింది.
మ్యూటేషన్ చెంది మనుషులపై ప్రభావం..
ప్రాథమికంగా జంతువులు, పక్షుల్లోనే ఉండి వాటిపైనే ప్రభావం చూపే సూక్ష్మజీవులు మ్యూటేషన్ చెంది మనుషులపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. అయితే 1940 దశాబ్దం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించగా.. అందులో 60 శాతానికిపైగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించినవే అని అధ్యయనం చెబుతోంది. జంతువులు, పక్షుల నుంచి మనుషులకు విస్తరిస్తున్న కొత్త వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూపోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సగటున 3 నుంచి 4 వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో కొన్నిరకాల వైరస్‌లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. ఎబోలా, జికా, నిఫా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే వైరస్‌లలో 70 శాతానికిపైగా అడవి జంతువుల నుంచి, అలాగే పెంపుడు జంతువుల నుంచి వ్యాపించినవేనని పరిశోధకులు చెబుతున్నారు.
గుర్తించని వైరస్‌లు కూడా మరెన్నో..
నిజానికి చెప్పాలంటే భూమి భూమి కోట్లాది రకాల వైరస్‌లు ఉన్నాయి. వాటిలో మనం గుర్తించనవి, గుర్తించగలిగేలా ఉన్న వైరస్‌లు చాలా తక్కువ ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఇంకా మనం గుర్తించాల్సిన వైరస్‌లు 17 లక్షలకు పైగానే ఉంటాయని ఒక అంచనా. వాటిలో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్‌లు ప్రమాదకరమైనవని అధ్యయనం చెబుతుంది. ఈ వైరస్‌లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పుడు చేయాల్సిందేమిటి..?
ప్రకృతితో కలిసి జీవించడమే మనిషి చేయాల్సిన పని అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా వైరస్‌లు వచ్చిన తర్వాత వాటిని నియంత్రించేందుకు కష్టపడటం కంటే.. అసలు అలాంటి భయంకర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త పడటమే ఉత్తమమని అంటున్నారు. అడవులను నరికివేయడం ఆపాలని, వీలైతే కొత్తగా అడవులు పెంచాలని, అలాగే వన్యప్రాణుల వేట, వ్యాపారాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. జంతువులు, పక్షుల నుంచి వైరస్‌లు మనుషులకు వ్యాపించే అవకాశాలను ముందుగానే గుర్తించేందుకు చర్యలు చేపట్టాలంటున్నారు. ఒక వేళ వ్యక్తికి ఏదైనా వైరస్ సోకినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు. మానవుడు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల కూడా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: