Lipstick Side Effects: సౌందర్య ప్రియులకు షాకింగ్ న్యూస్.. పెదాలకు లిప్‌స్టిక్ రుద్దేస్తే ప్రమాదంలో పడినట్లే..
Side Effects Of Lipstick: ఆధునిక ప్రపంచంలో మహిళలు, సౌందర్యప్రియులు తమ అందాన్ని పెంచుకునేందుకు లిప్‌స్టిక్‌ను ఎక్కువగా వాడుతుంటారు. మార్కెట్‌లో ఉన్న చాలారకాల లిప్‌స్టిక్‌లను
Side Effects Of Lipstick: ఆధునిక ప్రపంచంలో మహిళలు, సౌందర్యప్రియులు తమ అందాన్ని పెంచుకునేందుకు లిప్‌స్టిక్‌ను ఎక్కువగా వాడుతుంటారు. మార్కెట్‌లో ఉన్న చాలారకాల లిప్‌స్టిక్‌లను మహిళలు అందంగా కనిపించేందుకు వినియోగిస్తుంటారు. మేకప్ చేయకపోయినా.. చాలామంది ఖచ్చితంగా లిప్ స్టిక్ వేసుకోవడాన్ని మనం తరచుగా చూస్తునే ఉంటాం. లిప్‌స్టిక్‌తో స్టైలిష్‌గా కనిపించేందుకు, ప్రత్యేకంగా కనిపించేందుకు నిత్యం సరికొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అయితే.. ఈ మేకప్ ప్రొడక్ట్ మీ అందాన్ని మెరుగుపరిచినప్పటికీ.. దానితో కొన్ని హానికర పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లిప్ స్టిక్ తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా అవసరమని సూచిస్తున్నారు. లిప్‌స్టిక్ మీ పెదవుల అందాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో.. అంతగా ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని పేర్కొంటున్నారు.
లిప్‌స్టిక్ ద్వారా మీ పెదవులపై రసాయన పొర ఏర్పడుతుందని.. దీని ద్వారా అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. అయితే.. మార్కెట్లలో లభించే అనేక లిప్‌స్టిక్‌లలో రసాయనాలతో తయారు చేస్తారు. ఇవి మీ ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. మీరు ఎక్కువగా లిప్‌స్టిక్‌ను ఉపయోగించేవారయితే.. అన్ని పరిశీలించిన తరువాతే మంచి బ్రాండ్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చౌకైన లిప్‌స్టిక్‌ను ఎప్పుడూ కొనొద్దని.. అస్సలు ఉపయోగించవద్దని పేర్కొంటున్నారు. నాసిరకం లిప్‌స్టిక్ ఎంత ప్రమాదకరమో ఇప్పడు మనం తెలుసుకుందాం..
లిప్ స్టిక్ సైడ్ ఎఫెక్ట్స్.. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత మనం ఏదైనా తిన్నప్పుడు, ఈ ఆహారంతో పాటు లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు కూడా మన శరీరంలోకి వెళతాయి. లిప్‌స్టిక్‌లో ఉండే ఈ రసాయనాలు శరీరానికి చాలా హానికరం. మీరు లిప్‌స్టిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే, అందులో ఉండే లెడ్, అల్యూమినియం, కాడ్మియం, క్రోమియం, మెగ్నీషియం మీ శరీరంలో లోపలికి వెళ్తాయి. ఇవి మీ నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్యూమినియం పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది. లిప్‌స్టిక్‌లో ఉండే మూలకాలు మీ శరీరంలోని ఫాస్ఫేట్‌ను కూడా తగ్గిస్తుంది. లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి, IQ స్థాయిని తగ్గిస్తుంది. లిప్‌స్టిక్‌లోని మూలకాలు శరీరంలోకి ప్రవేశించడం వల్ల చికాకు పెరుగుతుంది. లిప్‌స్టిక్ క్రోమియం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read: