రకరకాల షాంపుల వల్ల జుట్టు ఊడిపోతుందా.. అయితే ఇంట్లోనే బెస్ట్ షాంపు తయారుచేసుకోండిలా..
Health Tips: ఆధునిక కాలంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు బాగా దెబ్బతింటుంది. చాలా మంది చుండ్రు,
Health Tips: ఆధునిక కాలంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు బాగా దెబ్బతింటుంది. చాలా మంది చుండ్రు, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా కాలుష్యం, చలి ప్రభావం, హెయిర్ కలరింగ్, పోషకాహార లోపం, హీటింగ్ టూల్స్ వాడకం మొదలైన వాటి వల్ల కూడా జుట్టు పాడవుతుంది. ఒక్కోసారి జుట్టు ఆరోగ్యం చెడిపోతే కోలుకోవడం చాలా కష్టమవుతుంది.
ఈ సమస్యలను అధిగమించేందుకు చాలా మంది ఖరీదైన హెయిర్ ట్రీట్ మెంట్లు, షాంపులు వాడుతున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు. పైగా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్దమైన షాంపు తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు దీన్ని ఇంట్లోనే సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. అది ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
అవసరమయ్యే పదార్థాలు కప్పు అలోవెరా జెల్, కప్ లిక్విడ్ సోప్, కప్ డిస్టిల్డ్ వాటర్, టీస్పూన్ గ్లిజరిన్, అర టీస్పూన్ విటమిన్ ఈ ఆయిల్, 7-8 చుక్కల లావెండర్ ఆయిల్, షాంపూని నిల్వ చేయడానికి బాటిల్.
ఎలా చేయాలి.. ముందుగా అలోవెరా జెల్, డిస్టిల్డ్ వాటర్, వెజిటబుల్ గ్లిజరిన్, విటమిన్ ఈ ఆయిల్‌ను బాగా కలపాలి. దానికి లిక్విడ్ సోప్ వేసి కలపాలి. నెమ్మదిగా లావెండర్ ఆయిల్ వేసి మరోసారి కలపాలి. మిశ్రమం చాలా మృదువైనదని గుర్తుంచుకోండి. ఇప్పుడు దానిని ఒక సీసాలో నింపండి. ఈ షాంపూని వారానికి రెండు మూడు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.