ICC Test Rankings: టాప్ 10లోకి మెరుపులా దూసుకొచ్చిన పాకిస్తాన్ ప్లేయర్.. ఇండియన్స్ స్థానాలు ఎలా ఉన్నాయంటే..?
ICC Test Rankings: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పులు లేవు. కానీ బౌలింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
ICC Test Rankings: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పులు లేవు. కానీ బౌలింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తన టెస్టు కెరీర్‌లో తొలిసారిగా టాప్ 5 జాబితాలోకి ప్రవేశించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది 3 స్థానాలు ఎగబాకి ఈ స్థానానికి చేరుకున్నాడు. కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అతను 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ ఇప్పటికీ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.
ఇది కాకుండా భారతదేశానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టిమ్ సౌథీ 3వ స్థానంలో ఉండగా, జోష్ హేజిల్‌వుడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో షాహీన్ షా అఫ్రిది 7 వికెట్లు పడగొట్టడం ద్వారా పాక్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన తర్వాత కూడా భారత్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా తన 10వ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. కానీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పులు లేవు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు జరిగినా బ్యాటింగ్‌లో మాత్రం ఎలాంటి కదలిక లేదు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 903 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుషాగ్నే నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. భారత బ్యాట్స్‌మెన్ 5, 6 స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. మొత్తంమీద టాప్ 5లో ఒక భారతీయ బ్యాట్స్‌మెన్ ఉండగా టాప్ 10లో ఇద్దరు భారతీయ బ్యాట్స్‌మెన్ ఉన్నారు.