Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Seetharama Sastry: అశ్రునయనాల మధ్య ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..

తెలుగు గేయ రచయిత సిరివెన్నెల మరణంతో చిత్రపరిశ్రమ శోకసంధ్రంలో మునిగిపోయింది. నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో

Sirivennela Seetharama Sastry: అశ్రునయనాల మధ్య ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..
Siriveenala
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 01, 2021 | 2:59 PM

తెలుగు గేయ రచయిత సిరివెన్నెల మరణంతో చిత్రపరిశ్రమ శోకసంధ్రంలో మునిగిపోయింది. నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. అనంతరం ఈరోజు ఉదయం సిరివెన్నెల పార్దివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‏లోకి తీసుకురాగా.. పాటల సారథిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు.. అభిమానులు హాజరయ్యారు. కాసేపటి క్రితం సిరివెన్నెల అంత్యక్రియలు ముగిసాయి. జూబ్లీహిల్స్‏లోని మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.

దశాబ్ధాలుగా తన పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మరణించడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతోపాటు.. ప్రేక్షకులు సైతం జీర్ణంచుకోలేకపోతున్నారు. అక్షరాలను అందంగా ఒక్కచోట చేర్చి మనసులను కదిలించే కలం ఇక లేదని తెలిసి తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయింది. గత కొద్దిరోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. సిరివెన్నెలకు ఆరెళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరోవైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారు. ఆ తర్వాత రెండ్రోజులు బాగానే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్‏డా ట్రీట్‏మెంట్ కోసం కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇకకడ రెండ్రోజులు వైద్యం అందిస్తే కాస్త రికవరీ అయ్యారు.. ప్రికాస్టమీ కూడా చేశాం. 45 సాతం ఊపిరితిత్తు తీసేశాం. కాబట్టి మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుకు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ పై పెట్టాం. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్‏ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో సిరివెన్నెల నిన్న సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు కన్నుమూశారు.

Also Read: Viral Video: అలియా లెహెంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..