Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అదే రచ్చ కొనసాగుతుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ చిత్ర విచిత్ర టాస్క్‌లు ఇస్తూ వారి మధ్య గొడవలను మరింత పెంచుతున్నారు. ఇప్పటికే గొడవలతో, ఏడుపులతో...

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..
Biggboss 5 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2021 | 1:41 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అదే రచ్చ కొనసాగుతుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ చిత్ర విచిత్ర టాస్క్‌లు ఇస్తూ వారి మధ్య గొడవలను మరింత పెంచుతున్నారు. ఇప్పటికే గొడవలతో, ఏడుపులతో గందరగోళంగా ఉన్న హౌస్‌లో తాజాగా మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదలచేశారు. కంటెస్టెంట్స్‌కు బకెట్స్ లో రంగురంగుల బాల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఐస్ వాటర్‌లో కాళ్లు ఉంచాలని కాలు బయట పెడితే వేరే వాళ్లు ఆ బంతుల్ని దొంగిలించాల్సి ఉంటుంది. ఈ గేమ్ మొదలు కాగానే సన్నీ అందరి బాల్స్ దొంగిలించడానికి ట్రై చేశాడు.

ఇక బిగ్ బాస్ ఇంట్లో ఉన్న హౌజ్‌లో ఉన్న సభ్యుల మధ్య ఈ గేమ్ మరింత రచ్చ లేపింది. ఎప్పటిలానే సన్నీ కంట్రోల్ తప్పాడు. సిరిపై అనవసరంగా అరిచి రాద్ధాంతం చేశాడు సన్నీ.. సిరి కూడా అందుకు తగ్గట్టుగానే రెచ్చిపోయింది. కాలు బయట ఉండగానే సిరి సన్నీ బాల్స్ తీసుకునే ప్రయత్నం చేసింది.. కానీ సన్నీ కాలు ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత సిరి ఎప్పుడు కాలు బయట పెడుతుందా అని చూసిన సన్నీ.. ఒక్కసారిగా ఆమె దగ్గర ఉన్న బంతులను దొగలించే ప్రయత్నం చేశాడు. ఇంతలో కాలు ఉంది సన్నీ అంటూ సిరి అనడం.. లేదు అని సన్నీ వాదించడం జరిగాయి. కానీ సిరి వినలేదు. ఆతర్వాత షణ్ముఖ్ కల్పించుకొని కాలు ఉంది అనడంతో.. సిరీ నీతో మాట్లాడలేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా సిరి గట్టిగా అరిచింది. ఆ తర్వాత నా దగ్గరకు రా.. అని శ్రీరామ్ చంద్ర సన్నీని పిలిచాడు.

కానీ నా బాల్స్ ఇక్కడ ఉన్నాయి అంటూ సమాధానం చెప్పాడు సన్నీ. నా దగ్గర కూడా గుంజుకో అని శ్రీరామ్ అనగా.. బారాబర్ గుంజుకుంటా అన్నాడు సన్నీ.. ఇక చివరిలో కెమెరా ముందుకు వచ్చి తనలో తాను మాట్లాడుకుంటూ కనిపించాడు సన్నీ. సిరి ఉద్దేశిస్తూ నువ్వు ఏం ప్రూవ్ చేయడానికి ఆడతావో అర్ధమే కాదు.. ఒకడిని విలన్‌ని చేయడానికి ముందుంటావ్ అంటూ తనలో తానే మాట్లాడుకున్నాడు.. చూడాలి మరి ఈ రోజు ఇంకెంత రచ్చ జరుగుతుందో హౌస్‌లో.

Alo Read: IRCTC: మీరు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

Crime News: పులివెందులలో మహిళ దారుణ హత్య.. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే హతమార్చిన కిరాతకుడు!

Radhe Shyam Song: రాధేశ్యామ్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజువల్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..