Crime News: పులివెందులలో మహిళ దారుణ హత్య.. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే హతమార్చిన కిరాతకుడు!
కడప జిల్లాలో దారుణం జరిగింది. పులివెందులలో నడిరోడ్డుపై ఓ మహిళను అతికిరాతకంగా హతమార్చాడు దుండగుడు.

Murder
Pulivendula Woman Murder: కడప జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళను అతికిరాతకంగా హతమార్చాడు దుండగుడు. పులివెందులలోని మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ఎలక్ట్రికల్ వర్క్స్ షాప్ లో అందరూ చూస్తూ వుండగానే పొడిచి చంపాడు కిరాతకుడు. ఈ దారుణానికి సంబంధించి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పులివెందుల ప్రాంతానికి చెందిన రిజ్వాన అనే మహిళను ఆమె ప్రియుడే కత్తితో పొడిచి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.