Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం కక్కుర్తి రా బాబు.. ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తూంటే ఈ పనేంటి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: కొందరు మనుషులు కక్కుర్తికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ప్రపంచం ఏమై పోయినా సరే తమ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న భావనలో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పైత్యం మరీ ఎక్కువతుంది....

Viral Video: ఇదేం కక్కుర్తి రా బాబు.. ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తూంటే ఈ పనేంటి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2021 | 12:13 PM

Viral Video: కొందరు మనుషులు కక్కుర్తికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ప్రపంచం ఏమై పోయినా సరే తమ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న భావనలో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పైత్యం మరీ ఎక్కువతుంది. అలాంటి సందర్భాల్లోనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో కక్కుర్తికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇంతకీ విషయమేంటంటే.. ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి తంతు ముగిసిన అనంతరం వివాహానికి వచ్చిన అతిథులు విందును అస్వాదిస్తున్నారు. ఈ సమయంలో ఫంక్షన్‌ హాల్‌ బయట పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భోజనం చేస్తున్న వారంతా గందరోళానికి గురై ఆహారం ఉన్న ప్లేట్లను అక్కడే వదిలేసి పరులుగు తీశారు. అయితే ఒక ఇద్దరు మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా తింటూనే ఉన్నారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి మరీ మాకేంటి అన్నట్లు ప్లేట్‌లో ఉన్న చికెన్‌ను లాగించేస్తున్నారు.

దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీరి కక్కుర్తిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన మహారాష్ట్రాలోని బివాండిలో ఉన్న ఓ ఫంక్షన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. ఆరు వాహనాలు మాత్రం దగ్ధమయ్యాయి.

Also Read: Mother Brave Adventures: చిరుత నోట్లో కొడుకు తల.. అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వెంబడించి కాపాడిన తల్లి!

Sara Alikhan: అత్రంగి రేలో సారా అదిరిపోయే డ్యాన్స్‌.. యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రోమో..

Omicron: భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్.. లైవ్ వీడియో