Mother Brave Adventures: చిరుత నోట్లో కొడుకు తల.. అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వెంబడించి కాపాడిన తల్లి!
ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను చిరుత చెర నుంచి తప్పించి కాపాడింది. నరమాంస చిరుతపులిని బెదిరించి.. ఐదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది.
Mother fights with Leopard: ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను చిరుత చెర నుంచి తప్పించి కాపాడింది. నరమాంస చిరుతపులిని బెదిరించి.. ఎనిమిదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. చిరుతపులి దాడిలో చిన్నారికి తీవ్రగాయాలైనప్పటికీ చిన్నారిని తీసుకెళ్లలేకపోయింది. ఈ సమయంలో అరుపులు విన్న స్థానిక గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో చిన్నారికి చెంప, వెన్ను, ఒక కంటిపై తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో, గాయపడిన చిన్నారిని చికిత్స కోసం కుస్మి ఆసుపత్రిలో చేర్చారు.
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిధి జిల్లాలోని కుసుమి బ్లాక్‌లోని సంజయ్ టైగర్ బఫర్ జోన్‌లోని తుమ్సర్ రేంజ్‌లోని బారి ఝరియా గ్రామానికి చెందినది. మూడు వైపులా పర్వతాలతో చుట్టుముట్టబడిన బారి ఝరియా గ్రామానికి చెందిన శంకర్ బైగా భార్య కిరణ్ బైగా సాయంత్రం తన పిల్లలతో కలిసి చలి మంటల దగ్గర కూర్చున్నారు. కిరణ్ ఒడిలో ఓ చిన్నారి ఉండగా, పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసింది. అలాంటి పరిస్థితుల్లో చిరుతపులి ఎనిదేళ్ల కొడుకును నోట్లో పెట్టుకుని తీసుకెళ్లింది.
చాలా చీకటిగా ఉండటంతో ఆమె కూడా చిరుతపులి వెంట పరుగెత్తింది. బిడ్డా అరుపులు వినపడి పరుగున వచ్చిన తల్లికి అక్కడ ఘటన చూసి నోటి నుంచి మాట రాలేదు. కొడుకు తల మొత్తం ఆ చిరుత పులి నోట్లో ఉంది. అది చిన్నారిని లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. చిరుతను చూసిన మహిళ తొలుత భయపడిపోయింది. కానీ, తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండటంతో ధైర్యం తెచ్చుకుంది. వెంటనే తేరుకున్న మహిళ చిరుతపులి వెంట పడింది. ఈ క్రమంలో కిరణ్ దాదాపు కిలోమీటరు మేర చిరుతపులిని వెంబడించి తన బిడ్డను కాపాడుకోగలిగింది.
ఘటనకు సంబంధించి కిరణ్ మాట్లాడుతూ.. చీకట్లో పరుగెత్తే సరికి చిరుత తన బిడ్డను గోళ్లతో నొక్కుతూ కూర్చోబెట్టింది. చిరుతపులి నుంచి ఎలాగైనా తన బిడ్డను విడిపించుకోవాలని ధైర్యం చేసి అలికిడి చేయడం ప్రారంభించానని చెప్పారు. అటువంటి పరిస్థితిలో చిరుతపులి ఆమెపై కూడా చాలాసార్లు దాడి చేసింది. అయితే, అప్పటికి స్థానిక గ్రామ ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం గుమిగూడడంతో చిరుత అడవి వైపు పారిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న డిపార్ట్‌మెంట్ బృందం గ్రామానికి చేరుకుంది. గాయపడిన చిన్నారిని వెంటనే చికిత్స కోసం కుస్మి ఆసుపత్రిలో చేర్చారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ ఆఫీసర్ టైగర్ రిజర్వ్ తంసర్ సిధి అసిమ్ భూరియా మాట్లాడుతూ.. చిరుతపులి దాడిలో పిల్లలకు వెన్ను, చెంపలు, కళ్లపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వారు కుస్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని అటవీశాఖ భరిస్తుందని భూరియా తెలిపారు. దీంతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగం కూడా బాధిత కుటుంబానికి సహాయాన్ని అందించింది.
Read Also… Sara Alikhan: అత్రంగి రేలో సారా అదిరిపోయే డ్యాన్స్.. యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రోమో..