Menstrual Cramps: ఈ ఆయుర్వేద చిట్కాలతో నెలసరి నొప్పులను దూరం చేసుకోండి..

మహిళలను నెలకొకసారి పలకరించే సమస్యల్లో నెలసరి నొప్పులు ఒకటి. ఈ సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు

Menstrual Cramps: ఈ ఆయుర్వేద చిట్కాలతో నెలసరి నొప్పులను దూరం చేసుకోండి..
Follow us

|

Updated on: Dec 01, 2021 | 11:23 AM

మహిళలను నెలకొకసారి పలకరించే సమస్యల్లో నెలసరి నొప్పులు ఒకటి. ఈ సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిర్లు, వికారం, విపరీతమైన ఆందోళన, తలనొప్పి, నిద్రలేమి, మూడ్‌ స్వింగ్స్‌, ఫుడ్‌క్రేవింగ్స్‌…ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మహిళలు ఏవేవో ట్యాబ్లెట్లు, మందులు వాడుతుంటారు. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెడితే దుష్ర్పభావాలు కూడా చాలానే ఉంటాయి. అందుకే వీలైనంతవరకు ఇంటి చిట్కాలనే పాటించాలంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు దిక్సా భావ్సర్‌. ఈక్రమంలో నెలసరి నొప్పులను దూరం చేసుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారామే. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

టీలు, స్మూతీలు… పిరియడ్స్‌ సమయంలో గోరువెచ్చని హెర్బల్‌టీలు, స్మూతీలు ఎక్కువగా తీసుకోవాలి. ఫలితంగా తిమ్మిర్లతో పాటు వివిధ రకాల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఛామోలిన్‌టీ, అల్లం- నల్లమిరియాల టీ, జీలకర్ర- కొత్తిమీర- సోంపుటీ(సీసీఎఫ్‌), గ్రీన్‌టీలతో పాటు పసుపు, లెమన్‌ గ్రాస్‌, మెంతులతో తయారు చేసిన టీలు తాగితే బాగుంటుంది.

హాట్‌ జెల్‌ బ్యాగ్‌తో గోరువెచ్చని నీటితో నింపిన వాటర్‌ బాటిల్‌ లేదా హాట్‌ జెల్‌ బ్యాగ్‌ను ఉపయోగించి నెలసరి నొప్పులను దూరం చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఖర్చు కూడా అవసరం లేదు. అందుకే ఎక్కువమంది మహిళలు ఈ పద్ధతినే ఉపయోగిస్తారు. నొప్పులు ఉన్న భాగాల్లో వీటితో కాసేపు మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపులో ఉండే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

సూర్యరశ్మి సూర్యరశ్మిలో డి-విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది నెలసరిలో తిమ్మిర్లు, నొప్పులకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌ల ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తుంది. కాబట్టి పిరియడ్స్‌ సమయంలో ఉదయం పూట కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మిలో నిలబడాలి.

హైడ్రేటెడ్ గా ఉండాలి.. పిరియడ్స్‌ సమయంలో ఎక్కువ నీరు తాగాలి. దీనివల్ల వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఛామోలిన్‌ లేదా అల్లం టీ చమోమిలే లేదా అల్లం టీలను బాగా తీసుకోవాలి. నీటిలో కొన్ని పుదీనా కాడలు వేసి (మింట్‌ వాటర్‌) రోజులో అప్పుడప్పుడూ తీసుకుంటే శరీరంలో నీటి స్థాయులు బాగా పెరుగుతాయి. దీనివల్ల నెలసరి నొప్పులే కాదు ఇతర ఆరోగ్యప్రయోజనాలు సమకూరుతాయి.

యోగా సాధన యోగా, ఇతర ఎక్సర్‌సైజుల వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల స్థాయులు బాగా పెరుగుతాయి. ఇవి నెలసరి నొప్పులకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్‌ల ఉత్పత్తిని తగ్గించేస్తాయి. ప్రాణాయామం, శవాసనం వంటి తేలికైన ఆసనాలతో నొప్పులు దూరమవ్వడమే కాకుండా శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Also read:

Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్, ట్రాన్స్‎పోర్టు, ట్రీట్‎మెంట్ కట్.. ఎక్కడంటే..

Asthma: మీకు ఆస్తమా ఉందా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..

Winter Health: శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఇబ్బందులు.. ఇలా చేసి చూడండి.. చటుక్కున మాయం అయిపోతాయి..