Eye test in House: ఇక ఇంటిలోనే కంటి పరీక్ష చేసుకోండి..! అంతర్జాతీయ అవార్డులు పొందిన కొత్త పరికరాలు..(వీడియో)

Eye test in House: యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, వారు సృష్టించిన సరికొత్త టెక్నాలజీతో వారు సృష్టించిన ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పిస్తూ అవార్డులు అందజేస్తున్నారు జేమ్స్‌ డైసన్‌. ఈ ఏడాది 28 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి...


యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, వారు సృష్టించిన సరికొత్త టెక్నాలజీతో వారు సృష్టించిన ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పిస్తూ అవార్డులు అందజేస్తున్నారు జేమ్స్‌ డైసన్‌. ఈ ఏడాది 28 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వివిధ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన ఆవిష్కరణలను ఇటీవలే ప్రకటించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వృద్ధుల్లో కంటిచూపు మందగిస్తుంది. దీనికి కారణమైన నీటి కాసులను ఇంట్లోనే మనం పరీక్షించుకునేలా నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ శాస్త్రవేత్తలు హోప్స్‌పేరుతో వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. నల్లటి గ్లౌజ్‌లాంటి ఓ చేతి తొడుగును కంటిదగ్గర ఉంచడం ద్వారా ఇది కంటి లోపలి భాగాలపై పడుతున్న ఒత్తిడిని గుర్తిస్తుందని తెలిపారు. ఇందుకోసం పరికరంలో సెన్సర్‌ను అమర్చారు. ఈ పరికరాన్ని కనురెప్ప మధ్యభాగంలో ఉంచాలి. తద్వారా కంటిలో ఎంతశాతం ఒత్తిడి ఉన్నదీ స్మార్ట్‌వాచ్‌లో కనిపిస్తాయి. ఈ పరికరం డైసన్‌ అవార్డుల్లో అంతర్జాతీయ విభాగంలో విన్నర్‌గా నిలిచింది.

ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన డెఫ్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్నమైన ప్లాస్టిక్‌ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. పరారుణ కాంతి స్పెక్ట్రోస్కోపీ సాయంతో ఇది పనిచేస్తుంది. ఇది చేత్తో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేంత చిన్న పరిమాణంలో ఉంటుంది. ఈ స్కానర్‌ సాయంతో ఏ రకమైన ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసే అవకాశం ఉందో స్పష్టంగా గుర్తించవచ్చు. అలాగే భారీ రీసైక్లింగ్‌ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పరికరం డైసన్‌ అవార్డుల్లో సస్టెయినబిలిటీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.కత్తిపోట్లు గాని, మన శరీరంలో ఏదైనా పదునైన వస్తువుల్లాంటివి గుచ్చుకున్నప్పుడు మెరుగైన చికిత్స కోసం యూకేకు చెందిన లౌబరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. కత్తిపోట్లు, గాయాలవల్ల అయ్యే రక్తస్రావాన్ని ఇది త్వరంగా ఆపుతుంది. రియాక్ట్‌ గా పిలిచే ఈ పరికరంలో సిలికాన్‌తో తయారైన గాలిబుడగ ఉంటుంది. గాయంలోకి ఈ గాలిబుడగను చొప్పించి ఉబ్బిపోయేలా చేస్తారు. దాంతో గాయం లోపలి భాగాలపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మెడికల్‌ విభాగంలో ఈ పరికరం ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టేసింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published On - 8:42 am, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu