AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానాల కంట్రోల్స్‌పై సౌర రేడియేషన్ దెబ్బ..

విమానాల కంట్రోల్స్‌పై సౌర రేడియేషన్ దెబ్బ..

Phani CH
|

Updated on: Dec 02, 2025 | 7:39 PM

Share

ఎయిర్‌బస్ A320 విమానాలలో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ సమస్య కారణంగా ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది. సౌర రేడియేషన్ వల్ల ఈ కీలక డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తించారు. దీనిని సరిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 200-250 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ప్రయాణ ఆలస్యాలు, రద్దులు జరగవచ్చని సంస్థలు తెలిపాయి. ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశాయి.

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది. ఈ సంస్థలు వినియోగిస్తున్న ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ విమానాల్లోని ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో ఒక సంభావ్య సమస్యను గుర్తించడంతో, దానిని సరిదిద్దేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 200 నుంచి 250 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. తీవ్రమైన సౌర రేడియేషన్ కారణంగా A320 విమానాల్లోని కీలకమైన ఫ్లైట్ కంట్రోల్ డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నవంబరు 28న వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సాఫ్ట్‌వేర్ మార్పులు లేదా హార్డ్‌వేర్ అమరిక అవసరమని, దీనివల్ల విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని తెలిపింది. దేశంలో ఈ కేటగిరీకి చెందిన సుమారు 560 విమానాలు ఉండగా, వాటిలో 250 వరకు విమానాలకు ఈ మార్పులు అవసరమని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమస్య ఉన్న విమానాల్లోని ఎలివేటర్ ఐలరాన్ కంప్యూటర్‌ను వెంటనే మార్చాలని లేదా సరిచేయాలని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విమానం తదుపరి సర్వీసు ప్రారంభించేలోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ విషయంపై ఇండిగో స్పందించింది. ఎయిర్‌బస్ సూచనల మేరకు అవసరమైన తనిఖీలు చేపడుతున్నామని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. తమ ఫ్లీట్‌లోని కొన్ని విమానాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సి ఉందని, దీనివల్ల సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా ధ్రువీకరించాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 31 విమానాలపై ఈ ప్రభావం పడనుంది. ప్రయాణికుల భద్రతే తమ మొధటి ప్రాధాన్యమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌బస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు

తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..

కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి