అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్
దేశవ్యాప్తంగా ప్రైవేటు స్లీపర్ బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో NHRC రంగంలోకి దిగింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించే బస్సులను తొలగించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. బస్సుల రూపకల్పన లోపాలు, డ్రైవర్ క్యాబిన్ వేర్పాటు వంటి కారణాలతో అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, సమగ్ర నివేదిక కోరింది.
దేశవ్యాప్తంగా ఇటీవల ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే.. ప్రైవేట్ ట్రావెల్స్.. స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాలను నిలువరించేందుకు NHRC రంగంలోకి దిగింది. మానవ హక్కుల రక్షణ చట్టం కింద భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో మంటల్లో చిక్కుకొని ప్రయాణికులు మరణించిన ఘటనలపై ఎన్‌హెచ్ఆర్సీ కి ఫిర్యాదులు అందాయి. ప్రజా రవాణా బస్సుల రూపకల్పనలో ఉన్న లోపాలు ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పుగా ఉందని NHRC కి ఫిర్యాదులు అందాయి. కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణీకుల కంపార్ట్‌మెంట్ నుండి పూర్తిగా వేరు చేసి ఉందని.. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణీకులు మంటలను సకాలంలో గుర్తించడంలో అడ్డంకిగా మారిందని.. దీనివల్ల ప్రయాణీకులు మంటల్లో చిక్కుకొని మరణించిన ఇటీవల సంఘటనలు NHRC దృష్టికి వచ్చాయి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును కాల రాసేలా స్లీపర్ క్లాస్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పలువురు ఫిర్యాదు చేశారు. ప్రమాద ఘటనలు బస్సుల తయారు చేసే కంపెనీలు, వాటి ఫిట్‌నెస్ ను ఆమోదించే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్నాయని.. భద్రత ప్రమాణాలు పెంపొందించడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం నిర్థారించడానికి జోక్యం చేసుకొవాలని పిటిషన్ లో అభ్యర్థించారు. ఈ బస్సు ఘటనలపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల
బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు
తుని ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం.. యువకుడి కాలులో అది పెట్టేసి కుట్టేసారు..
కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి
ఊరెళ్లేటప్పుడు ఇల్లే.. ఇంటికి వచ్చేసరికి కోళ్ల ఫారం అయ్యింది.. అదే కదా మ్యాజిక్కు..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

