AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

Phani CH
|

Updated on: Dec 02, 2025 | 5:29 PM

Share

ఆధార్ మొబైల్ నంబర్ మార్చడానికి UIDAI శుభవార్త ప్రకటించింది. ఇకపై ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే 'mAadhaar' యాప్ ద్వారా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త సౌకర్యం సమయం ఆదా చేస్తుంది, క్యూలలో నిలబడే శ్రమను తగ్గిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్‌లు ఫోన్ నుంచే చేసేలా UIDAI కృషి చేస్తోంది.

ఆధార్ కార్డ్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పింది. ఇకపై ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే సౌలభ్యాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌పై UIDAI ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించింది. వినియోగదారులు ఓటీపీ వెరిఫికేషన్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా సులభంగా తమ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ సేవ ‘ఎం-ఆధార్’ (mAadhaar) యాప్‌లో అందుబాటులో ఉంటుందని, ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కేవలం అడ్రస్‌ ఛేంజ్‌ చేసుకోడానికి మాత్రమే అవకాశం ఉంది. మొబైల్ నంబర్ లేదా ఇతర వివరాలు మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, క్యూలో నిలబడే శ్రమ తప్పుతుంది. ఈ సదుపాయాన్ని ముందుగా పరీక్షించాలనుకునే వారు తమ ఫీడ్‌బ్యాక్‌ను ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చని UIDAI కోరింది. దీంతో పాటు భవిష్యత్తులో మరిన్ని కీలక వివరాలను ఫోన్ నుంచే అప్‌డేట్ చేసుకునేలా ఒక సురక్షితమైన మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో యూఐడీఏఐ నిమగ్నమైంది. చాలా స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని, బయోమెట్రిక్ స్కానింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..

TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్‌.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా

Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు