AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

Phani CH
|

Updated on: Dec 02, 2025 | 5:20 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత వివాహంతో చర్చనీయాంశమైన భూతశుద్ధి క్రతువు, లింగభైరవి దేవి విశిష్టతలు ఈ వ్యాసంలో. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ ఆలయంలో కొలువైన లింగభైరవి, దైవిక స్త్రీ శక్తికి ప్రతీక. సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసిన ఈ దేవి అనుగ్రహంతో పంచభూత శుద్ధి వివాహాలు వధూవరుల జీవితాల్లో శాంతి, శ్రేయస్సును ప్రసాదిస్తాయి. ఆమె మహాదుర్గ, లక్ష్మి, సరస్వతి స్వరూపం.

స్టార్‌ హీరోయిన్‌ సమంత-రాజ్‌నిడుమోరు ప్రత్యేక సంప్రదాయంలో చేసుకున్న వివాహం గురించి సర్వత్రా చర్చనడుస్తోంది. భూతశుద్ది వివాహం అనేది పవిత్రమైన లింగభైరవీదేవి ఆలయాల్లో మాత్రమే నిర్వహించే పవిత్ర క్రతువు. అయితే ఈ లింగభైరవీ దేవి ఎవరు? ఆమె అంతశక్తిగల దేవతా? అసలు ఈ అమ్మవారి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లింగభైరవి అమ్మవారి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈశా యోగా ఫౌండేషన్‌ వద్ద ఉంది. ఈ ఆలయంలో స్వయంగా సద్గురు లింగభైరవీ అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ ప్రక్రియద్వారా ఒక శక్తి స్వరూపంగా ప్రతిష్ఠించారు. 8 అడుగుల ఎత్తయిన లింగాకార రూపంలో ఉండే ఈ దేవత దైవిక స్త్రీత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. ఇక్కడ మహాదుర్గ, మహాలక్ష్మి, మహా సరస్వతి త్రిమూర్తి స్వరూపాల్లో లింగభైరవి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తుల మనశ్శరీరాలను, శక్తులను స్థిరపరుస్తూ, జననం నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుందని చెబుతారు. ఈ ఆలయంలో పవిత్ర దేవతావృక్షమైన మర్రిచెట్టుకు పవిత్ర జలాన్ని సమర్పించడం ఇక్కడ ఆచారం. నవరాత్రుల సమయంలో లింగభైరవి దేవి దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాల్లో పూజలందుకుంటుంది. ఈశా ఫౌండేషన్‌లో కొలువైన లింగభైరవి ఆలయంలో భూతశుద్ధి వివాహాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. లింగభైరవి ఆలయంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు..వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందని చెబుతారు. వారి దాంపత్య జీవన ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈశా ఫౌండేషన్‌ చెబుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..

TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్‌.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా

Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు

పదే పదే గోరువెచ్చని నీరు తాగుతున్నారా ?? జాగ్రత్త