AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాప్‌ల వినియోగంపై కేంద్రం కొత్త రూల్

యాప్‌ల వినియోగంపై కేంద్రం కొత్త రూల్

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 1:26 PM

Share

కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే ఈ యాప్‌లు పనిచేయవు. సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా "టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025"లో ఈ మార్పులు చేశారు. దీనివల్ల నేరగాళ్లు యాప్‌లను దుర్వినియోగం చేయటం కష్టంగా మారుతుందని కేంద్రం ఆశిస్తోంది.

భారత్‌లో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌లు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్‌, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై యాప్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఫోన్‌లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే ఈ యాప్‌లు పనిచేయకుండా నిబంధనలు తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. దేశంలో సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన “టెలికమ్యూనికేషన్ సైబర్‌ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025 లో భాగంగా ఈ మార్పులు చేశారు. ఈ నిబంధనలను అమలు చేయడానికి యాప్‌లకు 90 రోజుల గడువు విధించారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్‌లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డ్‌తో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలని, మళ్లీ క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వనివ్వాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రతీ సెషన్ యాక్టివ్‌గా ఉన్న సిమ్‌తో ముడిపడి ఉంటుందని, అలాచేస్తే నేరగాళ్లు రిమోట్‌గా యాప్‌లను దుర్వినియోగం చేయటం కష్టంగా మారుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించుకుంటే చాలు. ఆ తర్వాత సిమ్ కార్డ్‌ను తీసేసినా లేదా డీయాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. దీనిని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ నిబంధనలపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మోసాలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని కొందరు అంటుండగా, నకిలీ లేదా దొంగిలించిన ఐడీలతో నేరగాళ్లు సులభంగా కొత్త సిమ్‌లను పొందగలరని, కాబట్టి దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చని మరికొందరు సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కొత్త నిబంధన వల్ల యూజర్లకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Janhvi Kapoor: ‘నా తల్లి మరణంపై తప్పుడు ప్రచారం చేశారు’ జాన్వీకపూర్ ఎమోషనల్ !!

సూర్య కాంతాన్ని మించేస్తున్న తనూజ కాతం !! పాపం బిగ్ బాస్

షాజహాన్ – ముంతాజ్‌ మెచ్చిన రింగ్‌తో నిశ్చితార్థం !! సమంత ఆలోచన వెరీ స్పెషల్

కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్‌లో..శిష్యుడు డేంజర్‌ జోన్ లో

గడ్డివాములో నల్లత్రాచు హల్‌చల్‌.. భయంతో జనం పరుగులు