AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్‌లో..శిష్యుడు డేంజర్‌ జోన్ లో

కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్‌లో..శిష్యుడు డేంజర్‌ జోన్ లో

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 12:56 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి దగ్గర పడుతోంది. 13వ వారంలో హోరాహోరీ నామినేషన్స్ జరిగాయి. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలగా, డబుల్ ఎలిమినేషన్ తో టాప్ 6 కి చేరే అవకాశం ఉంది. సుమన్ శెట్టి ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉండగా, రీతూ చౌదరి, ఇతర నామినేటెడ్ సభ్యులు సేఫ్ అవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాల్టీ షో ఇప్పటికే 13 వారానికి చేరుకుంది. అంటే మరో రెండు వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్న మాట. దీంతో టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి ఎవరు వెళతారు? బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆరుగురితో గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరా హోరీగా సాగాయి. ఈసారి షుగర్‌తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమ్మానుయేల్ రీతూ-డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే భరణి.. సంజన, డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే రీతూ.. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఆరుగురు లిస్ట్‌లో చేరారు. అయితే నామినేషన్స్‌లో ముందు భరణి లేడు. బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌ కారణంగా… కళ్యాణ్‌ పడాల… ఇమ్మానుయేల్‌ని సేఫ్ చేసి ఆ ప్లేస్‌లో భరణిని నామినేషన్స్‌లో చేర్చాడు. అలా ఇమ్మూ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇక కెప్టెన్ గా ఉన్న‌ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్… వీరిద్దరు కాకుండా తనూజ, భరణి, డిమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతూ చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్‌లో నిలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రీతూకు బయటి నుంచి ఫ్యాన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది.. కాబట్టి మరీ ముఖ్యంగా సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపర్చుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గడ్డివాములో నల్లత్రాచు హల్‌చల్‌.. భయంతో జనం పరుగులు

పెంపుడు కుక్కకు మత్తు మందు ఇచ్చి మరీ.. ఆలా.. ఎలా చేశారురా..

రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. మండిపడుతున్న నెటిజన్లు

Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే

Follow Us