పెంపుడు కుక్కకు మత్తు మందు ఇచ్చి మరీ.. ఆలా.. ఎలా చేశారురా..
కాకినాడ జిల్లా గొల్లపాలెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెంపుడు కుక్కకు మత్తుమందు కలిపిన బిస్కెట్లు వేసి స్పృహ తప్పించి, ఇంట్లో చొరబడ్డారు. ఇంటి యజమాని నేతి భగవాన్ పక్క ఇంట్లో ఉండగా, దొంగలు ల్యాప్‌టాప్‌తో పాటు కారును చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో పెంపుడు కుక్క ఉందని గ్రహించి దానికి మత్తు మందు కలిపిన బిస్కెట్లు వేసి స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ప్రవేశించారు దుండగులు. ఇంటిలోని ల్యాప్‌టాప్‌తోపాటు ఇంటి ఆవరణలో నిలిపిన కారుతో ఉడాయించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపాలెం గ్రామానికి చెందిన నేతి భగవాన్ ఇంటికి మరమ్మతులు చేయించే క్రమంలో పక్క ఇంట్లో ఉంటున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటల తరవాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంట్లో చోరీకి వచ్చారు. ఆ ఇంటి అరుగుపై పడుకొని ఉన్న శునకం దొంగల అలికిడికి లేచింది. వెంటనే దొంగలు ఆ కుక్కకు మత్తుమందు కలిపిన బిస్కెట్లు వేశారు. ఆ బిస్కెట్లు తిన్న శునకం వెంటనే మత్తులోకి జారుకుంది. అనంతరం చప్పుడు కాకుండా దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ విలువైన వస్తువులేవీ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న ల్యాప్‌ట్యాప్‌ను ఎత్తుకొని, ఇంటి ముందు పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూ కారుతో ఉడాయించారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రహించిన భగవాన్ పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ సీఐ పి. శ్రీనివాస్, ఎస్సై ఎం.మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. పెంపుడు శునకాన్ని పశు వైద్యులు పరీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. మండిపడుతున్న నెటిజన్లు
Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

