AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే

Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 12:28 PM

Share

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో వివాహం చేసుకున్నారు. ఈ రెండో పెళ్లి గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే, సమంత పెళ్లి తర్వాత షేర్ చేసిన ఫోటోలో కనిపించిన డైమండ్ రింగ్, పది నెలల క్రితం పోస్ట్ చేసిన చిత్రంలోనూ ఉండటంతో, అప్పుడే రహస్య నిశ్చితార్థం జరిగిందా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అభిమానులు ఈ విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు.

హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజ్‪‌తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు. పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్‌తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిత్వా ప్రభావం.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు

120 అడుగుల ఎత్తులో గాల్లో ఇరుక్కుపోయిన టూరిస్టులు.. ఏం జరిగిందంటే

అలాంటి స్లీపర్ బస్సులు రద్దు.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్

సౌదీలో దుమ్మురేపిన హైదరాబాదీ.. WRC3లో రెండో స్థానంలో నిలిచిన నవీన్ పులిగిల్ల

బర్త్ డే పార్టీలో గన్ ఫైర్.. క్షణాల్లోనే నలుగురు