రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. మండిపడుతున్న నెటిజన్లు
ఢిల్లీలో నెలకు రూ.26 వేల జీతం తీసుకునే ఉద్యోగి రూ.70 వేల ఐఫోన్ కొన్న వైనం వ్యాపారిని ఆశ్చర్యపరిచింది. ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసిన ఈ ఫోన్ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తక్కువ జీతంతో ఖరీదైన ఫోన్ కొనుగోలుపై కొందరు ఉద్యోగిని, మరికొందరు యజమానిని విమర్శించారు. యజమాని జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నానని స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఓ బిజినెస్‌మాన్ తన కింద పని చేసే ఉద్యోగి మనీ మేనేజ్‌మెంట్ తెలిసి ఆశ్చర్యపోయారు. నెలకు 26 వేల జీతం తీసుకునే తన ఉద్యోగి, ఏకంగా రూ.70,000 విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద చర్చే మొదలైంది. ఢిల్లీలో రెండు రెస్టారెంట్లను నడుపుతున్న కవల్‌జీత్ సింగ్ వద్ద ఓ వ్యక్తి ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల అతను కంపెనీ నుంచి ఒక నెల జీతం అడ్వాన్స్‌గా తీసుకుని, మరికొంత డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తానికి 12 నెలల ఈఎంఐ ప్లాన్‌పై కొత్త ఐఫోన్ కొన్నాడు. ఈ విషయాన్ని కవల్‌జీత్ సింగ్ ‘ఎక్స్’ లో షేర్ చేసారు. తన ఉద్యోగి జీతం రూ. 26 వేలని, కానీ, రూ. 70 వేల ఐఫోన్ కొన్నాడని, అతడి ఫైనాన్సింగ్ ప్లాన్ చూసి తన మైండ్ బ్లాంక్ అయిందని ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు. పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఉద్యోగి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడాన్ని తప్పుపట్టగా, మరికొందరు ఇంత తక్కువ జీతం ఇస్తూ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో ఎగతాళి చేస్తావా? అంటూ యజమానిపై విరుచుకుపడ్డారు. తక్కువ జీతం ఇస్తున్నారన్న విమర్శలపై కవల్‌జీత్ సింగ్ స్పందించారు. తన ఉద్యోగికి జీతంతో పాటు వసతి, భోజన ఖర్చులను కూడా కంపెనీయే భరిస్తోందని, ఆ ఖర్చులే నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉంటాయని ఆయన వివరణ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: నిశ్చితార్థం ఎప్పుడో చేసుకుంది! కాకపోతే హింట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

