రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్ టికెట్ల బుకింగ్ లో కొత్త రూల్స్
డిసెంబర్ 1 నుండి రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై మొబైల్ నంబర్‌కు OTP వెరిఫికేషన్ తప్పనిసరి. ఇది మోసాలను అరికట్టి, పారదర్శకతను పెంచుతుంది. కేవలం తత్కాల్ బుకింగ్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది, ఇతర టికెట్ బుకింగ్‌లు యథావిధిగా కొనసాగుతాయి. ప్రయాణికులకు సురక్షితమైన బుకింగ్ అనుభవాన్ని అందించడమే దీని లక్ష్యం.
డిసెంబర్ 1వ తేదీ రావడంతో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్ధిక వ్యవహారాలలో కొన్ని మార్పులు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా రైల్వే తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలను సోమవారం నుంచి ప్రవేశపెట్టనున్నారు. డిసెంబరు 1నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇక నుంచి తత్కాల్ సిస్టమ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి చేస్తున్నారు. ఓటీపీ వెరిఫై అయిన తర్వాతే తత్కాల్ టికెట్లు బుక్ అవుతాయి. ఒకవేళ ఓటీపీ తప్పుగా ఎంటర్ చేస్తే టికెట్ కన్ఫరేషన్ కాదు. టికెట్ల బుకింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కేవలం తత్కాల్ బుకింగ్‌లకు మాత్రమే ఆ విధానం వర్తిస్తుంది. మిగతా టికెట్లు యథావిధిగా ఐఆర్‌సీటీసీ లాగిన్స్‌తో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ బుకింగ్స్‌కు ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థ తీసుకురావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది తత్కాల్ బుకింగ్‌లో మోసాలకు పాల్పడుతున్నారు. దీని వల్ల అసలు ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఓటీపీ వెరిఫికేషన్ సిస్టమ్ కొత్తగా తీసుకొస్తుంది. వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే ఇక నుంచి టికెట్లు బుక్ చేసుకుంటారని, దీని వల్ల పారదర్శకత ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రీజర్‌లా మారిన అమెరికా.. మంచులో జారుతూ.. జూలో జంతువుల ఆటలు
ఆ విషయంలో నయన్‌ని ఫాలో కీర్తి సురేష్.. అదే ఆమె చేసిన తప్పా ??
నా కోసం కథలు రాయకండి.. కథల కోసమే నేను ఉంది
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

