Whatsapp Users: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్..  ఇక వెబ్‌లోనూ ఈ ప్రైవసీ ఫీచర్‌..!(వీడియో)

Whatsapp Users: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక వెబ్‌లోనూ ఈ ప్రైవసీ ఫీచర్‌..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 02, 2021 | 9:08 AM

వాట్సప్ వినియోగదారులకు మరింత రక్షణ కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్న వాట్సప్.. “మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్” అనే ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు


వాట్సప్ వినియోగదారులకు మరింత రక్షణ కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్న వాట్సప్.. “మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్” అనే ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు WhatsApp బీటా కోసం అందుబాటులో ఉంది. తాజాగా వాట్సప్ ఇతర వినియోగదారులకు కూడా ఈ ఫీచర్‌ను అందించేందుకు సిద్ధమైంది. కొత్త వెర్షన్ 2.2146.5తో ఈ ఫీచర్‌ను తాజాగా వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇన్‌స్టంట్-మెసేజింగ్ యాప్‌లోని ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌ను ఎవరు చూడాలో నిర్ణయించుకోవచ్చు. దీంతో యూజర్లకు సంబంధించిన డేటాకు మరింత రక్షణ దొరకనుందని కంపెనీ వెల్లడించింది. ప్రైవసీ సెట్టింగ్‌ల కింద ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. యాప్‌లో ఇప్పటికే మూడు ఆఫ్షన్‌లను అందించింది. కొత్త ఫీచర్‌తో, వినియోగదారుల ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌లను వేరే యూజర్లు చూడకుండా నియంత్రించుకోవచ్చు.ఇటీవల, వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త షార్ట్‌కట్‌ను కూడా విడుదల చేసింది. వీటితో యూజర్‌లు ఎవరైనా ఇతరులు షేర్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను చూస్తున్నప్పుడు వీడియో కాల్‌కూడా చేసుకోవచ్చు. ఈ షార్ట్‌కట్స్‌ను యాక్సెస్ చేయడానికి స్టేటస్ అప్‌డేట్‌ను చూస్తున్నప్పుడు స్క్రీన్ కుడివైపు ఎగువ భాగాన ఉన్న మూడు చుక్కలను నొక్కాలి. ఈ మెనులో “వీడియో కాల్” ఎంపికను యాక్సస్‌ చేసుకుని ఓకేసారి రెండు ఫీచర్లను వాడుకోవచ్చు. ఇంతకు ముందు ఈ ఆఫ్షన్‌తో కేవలం వాయిస్ కాల్స్‌ను మాత్రమే చేసుకునే వీలుండేది. కొత్త అప్‌డేట్‌తో వీడియోకాల్‌ కూడా చేసుకునే అవకాశాన్ని అందించింది. ఇప్పటికే 2.21.23 బీటా అప్‌డేట్‌ని కలిగి ఉన్న యూజర్లు వాయిస్ కాల్ షార్ట్‌కట్‌ను పొందవచ్చు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..