ట్రూ-కాలర్ కాదు.. అంతకు మించి.. ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే
తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం CNAP (కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్) వ్యవస్థను తీసుకువస్తోంది. దీని ద్వారా కాల్ చేసిన వ్యక్తి ఆధార్-లింక్డ్ పేరు ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ట్రూకాలర్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే సైబర్ మోసాలు, స్పామ్ కాల్స్‌ను అరికట్టడమే దీని లక్ష్యం. గోప్యత, కచ్చితత్వంపై చర్చ జరుగుతున్నా, ఇది భద్రతను పెంచుతుంది.
గుర్తు తెలియని నెంబర్లనుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? అది ఎవరు చేశారా అని తెలుసుకోడానికి ట్రూకాలర్‌లోకి వెళ్లి చెక్ చేసుకుంటున్నారా.. దీనివల్ల సమయం వృధా అవుతుందని భావిస్తున్నారా.. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. ఇకపై మీకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్ వస్తే, నెంబర్‌తోపాటు ఆ వ్యక్తి పేరు కూడా కనిపించేలా దీనిని రూపొందించింది. ఇప్పటి వరకు ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఈ పని చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకుంది. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కాలర్ పేరు తెలుసుకోవడానికి ట్రూకాలర్ వంటి యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం CNAP అనే కొత్త కాలర్ ID సిస్టమ్‌ను తీసుకువస్తోంది, దీనిద్వారా కాల్ చేసే వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకూ తెలియని నంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు, నంబర్ మాత్రమే కనిపిస్తుంది, కానీ త్వరలో నెంబర్‌తో పాటు కాల్ చేసే వ్యక్తి పేరు కూడా కనిపిస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ విధానాన్ని పరీక్షిస్తున్నారు. CNAP అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్. ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన ట్రూ-కాలర్ ధృవీకరించిన వెర్షన్ అని చెప్పవచ్చు. ట్రూకాలర్ వంటి యాప్‌లు క్రౌడ్‌సోర్స్ చేసిన డేటాపై ఆధారపడి ఉంటాయి, అయితే CNAPలో నంబర్‌తో పాటు కాల్ చేసే వ్యక్తి ఆధార్-లింక్డ్ పేరు కనిపిస్తుంది. ఈ సిస్టం తెలియని నంబర్‌లతోపాటు మీ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్‌లపై కూడా పని చేస్తుంది. అంటే, మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడల్లా, మొదట ఆ నంబర్‌తో లింక్ చేసిన ఆధార్ కార్డ్ పేరు కనిపిస్తుంది, ఆ తర్వాత మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఆ కాంటాక్ట్ పేరు కనిపిస్తుంది. ఈ కొత్త సిస్టం ఎందుకు తీసుకొస్తున్నారు అంటే.. గత కొంతకాలంగా దేశంలో సైబర్ నేరాలు పెరిగాయి. ప్రజలు మోసాలకు గురవుతున్నారు. మోసాలు, స్పామ్ కాల్స్‌ను నిరోధించడానికి ఈ వ్యవస్థను తీసుకువస్తున్నారు. CNAP పోర్టల్‌కు గత నెలలో ఆమోదం లభించింది. ఇప్పుడు టెలికాం కంపెనీలు దీన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. థర్డ్ పార్టీ యాప్‌లలో, వినియోగదారులు తమ ప్రొఫైల్‌ను సృష్టించేటప్పుడు తమ ఇష్టం వచ్చిన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు, కానీ ఇందులో అలా ఉండదు. ఇది నంబర్‌తో లింక్ చేసిన ఆధార్ కార్డ్ నుంచి కాలర్ పేరును తీసుకుంటుంది. అయితే CNAP సిస్టమ్‌లో గోప్యత, కచ్చితత్వం, అలాగే వినియోగదారులు తమ డిస్‌ప్లే నేమ్‌ను మార్చుకోగలరా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీరికి సీతాఫలం విషంతో సమానం.. హెచ్చరిస్తున్న వైద్యులు
డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్
గోవా ట్రిప్ పేరుతో క్యాసినోల్లో జూదం.. ఆస్తులు కుదువపెట్టి అప్పులపాలవుతున్న యువత
ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా దీనిలో..
శుభకార్యాలకు లాంగ్ బ్రేక్..! శుక్ర మౌఢ్యమి నిజంగా అశుభ సమయమా..?
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

