గోవా ట్రిప్ పేరుతో క్యాసినోల్లో జూదం.. ఆస్తులు కుదువపెట్టి అప్పులపాలవుతున్న యువత
అత్యాశతో రాత్రికి రాత్రే లక్షాధికారులు కావాలనుకునే అమాయకులను వైట్ కాలర్ ఏజెంట్లు గోవా క్యాసినోలకు తీసుకెళ్లి లూటీ చేస్తున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చుకుంటూ పచ్చని కాపురాల్లో కలహాలు సృష్టిస్తున్నారు. ఈ మోసాలపై పోలీసులు తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అత్యాశ, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న దురుద్దేశం వైట్ కాలర్ ఏజెంట్లకు వరంగా మారుతోంది. లక్ష రూపాయల పెట్టుబడితో రాత్రికి రాత్రే లక్షాధికారులు కావచ్చని నమ్మబలుకుతారు. గోవాకు టూర్‌తో అమాంతం గోకేస్తారు. రంగుల క్యాసినోలకు తీసుకెళ్తారు. జల్సాలు, పేకాట పేరుతో చేతిలో డబ్బులు లేకున్నా అప్పులు చేయించి లూటీ చేస్తారు. చేతిలో ఉన్న డబ్బు పోగా, బండెడు అప్పుతో ఇంటికొచ్చిన జల్సారాయుళ్లు పెద్దలు కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తున్నారు. ఫలితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నాయి. ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలకూ కారణాలుగా మారి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. యాదాద్రి జిల్లా ఆలేరు కేంద్రంగా వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తున్న వారిని ఏజెంట్లు టార్గెట్ చేసుకుంటున్నారు. గోవా విహారయాత్రల పేరుతో ఉచ్చులోకి దించుతున్నారు. గోవాలో క్యాసినో మాయలో పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. లక్షకు లక్షాధికారి కావచ్చంటూ జేబులు లూటీ చేస్తున్నారు. ఆస్తులు, బంగారు ఆభరణాలు కుదువపెట్టుకొని అప్పులు ఇచ్చి మరీ జూదంలోకి దించుతున్నారు. ఆలేరు కేంద్రంగా గోవా క్యాసినో దందా కొనసాగుతోంది.లక్షలాది రూపాయలు క్యాసినో ఆటలో పోగొట్టుకొని ఆర్థికంగా చితికిపోతూ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. తమ వెంట తీసుకెళ్లిన డబ్బులు ఆటలో పోగొట్టుకోగానే అప్పుగా డబ్బులు ఇచ్చేవారు కూడా అక్కడే ఉంటారు. ఇళ్ల స్థలాలతో పాటు భార్యల పుస్తెలతాడును సైతం కుదవ పెడుతూ అప్పుల ఊబిలో పడిపోతున్నారు. సులువుగా డబ్బు సంపాదన మోజులో ఉన్నదంతా పోగొట్టుకొని కుటుంబంతో ఉండలేక సమాజంలో తలెత్తుకోలేక అనారోగ్యాల బారిన పడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని బాధితులు చెబుతున్నారు. క్యాసినో వలలో పడి ఎంతోమంది ఆర్థికంగా నష్ట పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ మాయాజాలంలో మరికొన్ని కుటుంబాలు పడకముందే పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా దీనిలో..
శుభకార్యాలకు లాంగ్ బ్రేక్..! శుక్ర మౌఢ్యమి నిజంగా అశుభ సమయమా..?
పాపం.. వృద్ధురాలని కూడా చూడకుండా నడి రోడ్డుపై ..
చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త
పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చిన భర్త.. అలా ఎలా చేసావ్ భయ్యా
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

