AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా  దీనిలో..

ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా దీనిలో..

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 7:30 PM

Share

ఒక అరుదైన ఫ్యాబెర్జీ వింటర్ ఎగ్ వేలానికి సిద్ధమైంది. రష్యా జార్ నికోలస్‌–2 తన తల్లికి వందేళ్ల క్రితం ఇచ్చిన ఈ కళాఖండం డిసెంబర్ 2న క్రిస్టీస్ ద్వారా లండన్‌లో వేలం వేయబడుతుంది. ప్లాటినమ్, 4,500 వజ్రాలతో తయారైన ఈ గుడ్డు రూ. 236 కోట్లకు పైగా ధర పలకవచ్చని అంచనా. దీని ప్రత్యేకత, అద్భుతమైన డిజైన్ ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి.

రష్యా జార్‌ చక్రవర్తుల వింటర్‌ ఎగ్‌ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్‌ల మోత మోగించేందుకు సిద్ధమైంది. రష్యా జార్‌ చక్రవర్తి నికోలస్‌–2 తన తల్లి, రాజమాత మారియా ఫియోడోరోవ్‌నాకు వందేళ్ల క్రితం ఈస్టర్‌ కానుకగా బహూకరించిన విలువైన వింటర్‌ ఎగ్‌ గురించే ఇప్పుడా అంతా చర్చించుకుంటున్నారు. డిసెంబర్‌ రెండున క్రిస్టీస్‌ వేలం సంస్థ లండన్‌ ప్రధాన కార్యాలయంలో వేలంపాట నిర్వహించబోతోంది. ఈ వేలం పాటలో స్ఫటికంతో తయారైన ఫ్యాబెర్జీ వింటర్‌ ఎగ్‌ ఏకంగా రూ.236 కోట్లకు పైగా ధర పలకవచ్చన్న అంచనా వేస్తున్నారు. దీనిని పేరున్న వజ్రాభరణాల సంస్థ ఫ్యాబెర్జీ తయారుచేసింది. 1913 సంవత్సరంలో రాజు నికోలస్‌ దీనిని తన తల్లికి బహూకరించారు. రష్యా ప్రభుత్వ అధీనంలో కాకుండా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇదీ ఒకటి. ధవళవర్ణంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్‌ ఎగ్‌ ఎత్తు 10 సెంటీమీటర్లు. గుడ్డులాగా కనిపించినా దానిని రెండుభాగాలుగా తెరవొచ్చు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచుబిందువులు పడి ఘనీభవించినట్లు కనిపించేలా దీనిని డిజైన్‌చేశారు. ప్లాటినమ్‌ తో తయారైన బుట్టలో అనిమోనిస్‌ పుష్పాలను గుది గుచ్చి చూడచక్కటి పుష్పగుచ్ఛా న్ని తయారుచేసి లోపల పెట్టారు. 4,500 చిన్న చిన్న వజ్రా లను పొదిగారు. అనిమో నిస్‌ పుష్పాలను క్వార్జ్‌తో తయారుచేశారు. ఆకుల ను పచ్చలతో రూ పొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత రుతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమో నిస్‌ పుష్పాలు వికసిస్తా యి. కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. ఫ్యాబెర్జీ వజ్రాభరణాల సంస్థ స్వర్ణకారులు దీనికి తయారు చేశారు. ‘‘అద్భుత చేతి పనితనం, ఆకర్షణీయ డిజైన్‌కు ఈ వింటర్‌ ఎగ్‌ పెట్టింది పేరు. అలంకరణ కళల్లో ఈ ఎగ్‌ ఒకరకంగా మోనాలిసా పెయింటింగ్‌లాంటిది’’ అని క్రీస్టిస్‌ వేలంసంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్‌ వ్యాఖ్యానించారు. ఫ్యాబెర్జీ వజ్రా భరణాల సంస్థ 1885 నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం 50 స్మారక ఎగ్‌లను తయారు చేసి ఇచ్చింది. జార్‌ చక్రవర్తి అలెగ్జాండర్‌ ద థర్డ్‌ తన సతీమణికి ప్రతి ఈస్టర్‌కు ఒక ఈస్టర్‌ ఎగ్‌ ను బహూకరించి ఇలా ఎగ్‌ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్‌ ద సెకండ్‌ కొనసా గించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శుభకార్యాలకు లాంగ్‌ బ్రేక్‌..! శుక్ర మౌఢ్యమి నిజంగా అశుభ సమయమా..?

పాపం.. వృద్ధురాలని కూడా చూడకుండా నడి రోడ్డుపై ..

చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్‌ జాగ్రత్త

పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చిన భర్త.. అలా ఎలా చేసావ్ భయ్యా

అమ్మవారి గుడికి వెళ్లిన భక్తులు..దెబ్బకి వెనక్కి పరుగు..