AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్‌

డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్‌

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 8:08 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకొచ్చిన డెడ్‌బాడీ, పువ్వులు, బంధువులు లేకుండా అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడివారు పరిశీలించగా, అది ప్లాస్టిక్ బొమ్మ అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి, బీమా మోసం లేదా ఇతర నేరాల ఆనవాళ్లను తొలగించేందుకు చేసిన కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.

ఇద్దరు వ్యక్తులు ఓ డెడ్‌బాడీని తీసుకొని స్మశానానికి వచ్చారు. అక్కడ చితి పేర్చి దహన సంస్కారాలకు ఏర్పాటు చేశారు. ఇక దహనసంస్కారానికి సిద్ధమవుతుండగా అక్కడున్నవారికి అనుమానం వచ్చింది. వెంటనే ఆ డెడ్‌ బాడీపై కప్పిన వస్త్రాలను తొలగించి చూశారు. చితిపై కనిపించిన డెడ్‌బాడీని చూసి వారంతా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. గురువారం మధ్యాహ్నం గర్హ్ముక్తేశ్వర్‌లోని బ్రిజ్‌ఘాట్‌లో ఇద్దరు యువకులు ఓ డెడ్‌బాడీని తీసుకొని దహన సంస్కారాల కోసం ఓ కారులో స్మశానవాటికకు వచ్చారు. సాధారణంగా మృతదేహాన్ని పువ్వులతో అలంకరించి, బంధు,మిత్రులందరూ దేవుడి పాటలు పాడుతూ ఊరేగింపుగా స్మశానానికి తీసుకొస్తారు. కానీ ఇక్కడ సీన్‌ చూస్తే అలా లేదు. కేవలం ఇద్దరు వ్యక్తులు డెడ్‌బాడీని గుడ్డలు చుట్టి బుజాలపై మోసుకొచ్చారు. దాంతో స్మశానవాటికలో ఉన్న కాటికాపరికి, ఇతరులకి అనుమానం వచ్చింది. వెంటనే వారు ఆ యువకులు అంత్యక్రియలు చేసేందుకు సిద్దమవుతుండగా అక్కడికి వెళ్లి ఆ డెడ్‌బాడీపై కప్పిన బట్టలను తొలగించి చూసారు. అది డెడ్‌ బాడీకాదు.. ఓ ప్లాస్టిక్‌ బొమ్మ. దానిని చూడగానే అక్కడ గుమిగూడిన ప్రజలు దెబ్బకు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసారు. ఈ చర్య వెనుక కుట్ర భాగం ఏదైనా ఉండొచ్చునని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి, నేరస్థుడు మరణాన్ని ఫేక్‌గా చూపించి చట్టం నుంచి తప్పించుకోవడానికి లేదా ఏదైనా నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకు ఇలా చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. చూపించడానికి ఈ చర్య కుట్రలో భాగమై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోవా ట్రిప్‌ పేరుతో క్యాసినోల్లో జూదం.. ఆస్తులు కుదువపెట్టి అప్పులపాలవుతున్న యువత

ఈ గుడ్డు ధర రూ. 236 కోట్లు.. అంతలా ఏముందిరా దీనిలో..

శుభకార్యాలకు లాంగ్‌ బ్రేక్‌..! శుక్ర మౌఢ్యమి నిజంగా అశుభ సమయమా..?

పాపం.. వృద్ధురాలని కూడా చూడకుండా నడి రోడ్డుపై ..

చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్‌ జాగ్రత్త